ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో నేడు మహా సమరం జరగబోతోంది. మిగిలివున్న ఏకైక ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష వంటిది. టాస్ గెలిచిన చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్.. డుప్లెసిస్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మరికొద్ది సేపట్లో అసలు పోరు మొదలుకానుంది.
తొలి అర్ధభాగంలో అట్టడుగున నిలిచిన బెంగుళూరు జట్టు అనూహ్యంగా ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుంది. కాకపోతే, వీరు చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి. ఉదాహరణకు 200 పరుగులు చేశారనుకుంటే.. చెన్నైని 182 పరుగులలోపే కట్టడి చేయాలి. అలా జరిగితేనే సీఎస్కే రన్‌రేటును ధాటి ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకోగలరు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
తుది జట్లు
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ.
బెంగుళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.