ఐపీఎల్ లో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్ నేడు (మే 18) జరగనుంది. ప్లే ఆఫ్ బెర్త్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఐపీఎల్ లో అత్యంత పాపులారిటీ పొందిన రెండు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం తలపడుతుండడం ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. భారీ ఫాలోయింగ్ ఉన్న టీమిండియా క్రికెటర్లు ధోనీ, కోహ్లీ ఉండడంతో ఈ సీజన్ లో ఇది బ్లాక్ బస్టర్ మ్యాచ్ గా మిగిలిపోనుందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.
ఈ మ్యాచ్ చూడటానికి అంతా సిద్దమనుకున్న వేళ వర్షం ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. నేడు (మే 18) జరగనున్న మ్యాచ్ కు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా నివేదికలు చెప్పుకొస్తున్నాయి. అయితే తాజా సమాచార ప్రకారం బెంగళూరులో ఈ రోజు ఉదయం ఎండ కాసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఎండ కాస్తున్నా.. నగరంలో సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. బెంగుళూరులోని సాయంత్రం 4-8 గంటల మధ్య మాత్రమే తేలికపాటి మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అదే జరిగితే టాస్ వేయడం ఆలస్యం అవుతుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధిస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. కానీ బెంగుళూరుది డిఫ్రెంట్ స్టోరీ. వారు గెలిస్తే సరిపోదు.. వారు తుదిపరి దశకు చేరుకోవాలంటే నెట్ రన్ రేట్ ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది.
మొదట చెన్నై బ్యాటింగ్ చేస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 11 బంతులు మిగిలుండగానే ఛేదించాలి. ఒకవేళ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీని ప్రకారం 15 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్ కు చేరుతుంది. మరోవైపు బెంగళూరు 13 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
Bengaluru Weather :
— Cric Point (@RealCricPoint) May 18, 2024
Sun is out with shadow of clouds.
Join our Telegram for Live Updates : https://t.co/Q0dzMUCTZX#RCBvsCSK pic.twitter.com/zSgW4hX4zS