వరుసగా నాలుగు విజయాలు సాధించి మంచి జోరుమీదున్న బెంగళూరు జట్టు.. నేడు మరో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్సర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడడంతో.. బెంగళూరు పోరుకు అక్సర్ పటేల్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. రిషబ్ స్థానంలో కుమార్ కుషాగ్రాను జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్.
ఢిల్లీ: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), షాయ్ హోప్, కుమార్ కుషాగ్రా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్ ), కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.