WPL లో 202 రన్స్ ఉఫ్‌‌‌‌‌‌‌‌..రికార్డు టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజ్ చేసిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ

WPL లో  202  రన్స్ ఉఫ్‌‌‌‌‌‌‌‌..రికార్డు టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజ్ చేసిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ
  • రికార్డు టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజ్ చేసిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ..  దంచికొట్టిన రిచా ఘోష్‌‌, ఎలైస్ పెర్రీ
  • 6 వికెట్ల తేడాతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌పై విక్టరీ

వడోదర:  విమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌‌‌‌‌‌‌(డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌) మూడో ఎడిషన్‌‌‌‌‌‌‌‌ ఆరంభం అదిరింది. తొలి పోరులోనే ఫోర్లు, సిక్సర్ల మోతతో స్టేడియం హోరెత్తింది. ఈ హైస్కోరింగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  గుజరాత్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌పై డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ రాయల్ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుదే పైచేయి అయింది.  రిచా ఘోష్ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్‌‌‌‌‌‌‌‌), ఎలైస్ పెర్రీ  (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57)  ధనాధన్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో 202 రన్స్ భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసి రికార్డు సృష్టించిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ కొత్త ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ ఆష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌నర్ (37 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 నాటౌట్‌‌‌‌‌‌‌‌, 2/33) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నా భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన గుజరాత్‌‌‌‌‌‌‌‌ 6 వికెట్లతేడాతో ఓడిపోయింది.  తొలుత గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (42 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లతో 56) ఫిఫ్టీలతో సత్తా చాటడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 201/5 స్కోరు చేసింది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ  18.3  ఓవర్లలోనే 202/4  స్కోరు చేసి గెలిచింది. లీగ్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది. కనిక అహుజా (13 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 30 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 37 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 93 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని గెలిపించారు. రిచాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధనాధన్‌‌‌‌‌‌‌‌

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన గుజరాత్‌‌‌‌‌‌‌‌కు ఓపెనర్ బెత్ మూనీ జట్టుకు మంచి ఆరంభం అందించింది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ రెండో బాల్‌‌‌‌‌‌‌‌కే బౌండ్రీల ఖాతా తెరిచిన ఆమె  మరో ఓపెనర్ లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్ (6)తో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 35 రన్స్ జోడించింది. వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌ను బౌల్డ్ చేసిప రేణుకా సింగ్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీకి తొలి బ్రేక్ ఇవ్వగా..  దయలన్‌‌‌‌‌‌‌‌ హేమలత (4)ను కనిక అహుజా వెనక్కుపంపించింది. వెంటవెంటనే రెండు వికెట్లు పడినా గుజరాత్ జోరు తగ్గలేదు. వారెహమ్ వేసిన పదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విజృంభించిన మూనీ 37 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాతి ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. జోరుమీదున్న మూనీని ప్రేమ రావత్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి కీలక బ్రేక్ అందించినా..  దియేంద్ర డాటిన్ (25) సహకారంతో  జీజీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుకు తీసుకెళ్లింది. డాటిన్‌‌‌‌‌‌‌‌ వచ్చీరాగానే రెండు ఫోర్లతో అలరించగా.. ప్రేమ వేసిన 14వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియాన్ని హోరెత్తించింది. రేణుక బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో డాటిన్ ఔటవ్వడంతో  నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. అప్పటికే 24 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ అందుకున్న గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లాగ్ ఓవర్లోనూ తన పవర్ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించింది. జోహిత వేసిన 18వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన ఆమె వారెహమ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మరో సిక్స్ కొట్టింది. చివరి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో స్కోరు 200 దాటించి అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. 

పెర్రీ పునాది.. రిచా ముగింపు

ఛేజింగ్‌‌ ఆరంభంలో తడబడినా.. ఎలైస్ పెర్రీ, రిచా ఘోష్ మెరుపులతో ఆర్‌‌‌‌సీబీ విజయం అందుకుంది. గుజరాత్ కెప్టెన్ గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ మెరిసి ఆరంభంలోనే  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని దెబ్బ కొట్టింది. తన తొలి ఓవర్లోనే సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆర్‌‌‌‌సీబీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన (9)తో పాటు డాని వ్యాట్‌‌‌‌‌‌‌‌ (4)ను ఔట్ చేసి షాకిచ్చింది. కానీ, పెర్రీ, రాఘవి బిస్త్‌‌‌‌‌‌‌‌ (25) ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టారు. బిస్త్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సపోర్ట్ ఇవ్వగా... పెర్రీ భారీ షాట్లతో ఎదురుదాడి చేసింది. ఈ క్రమంలో 27 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా స్కోరు వంద దాటింది. మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు పెర్రీ, రాఘవి 86 రన్స్ జోడించారు. కానీ, మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో ఆ జట్టు 109/4తో డీలా పడింది.  ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ జట్టు బాధ్యత తీసుకుంది. కనిక అహుజా సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో భారీ షాట్లతో జీజీ బౌలర్లపై విరుచుకుపడి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని మళ్లీ రేసులోకి తెచ్చింది. 13 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద క్యాచ్ ఔట్ ప్రమాదం తప్పించుకున్న ఘోష్‌‌‌‌‌‌‌‌.. గార్డ్‌‌‌‌‌‌‌‌నర్ వేసిన 16వ ఓవర్లో నాలుగు, ఫోర్లు సిక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెలరేగి 23 రన్స్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ వెంటనే కనిక రెండు ఫోర్లు కొట్టగా.. ప్రియా మిశ్రా వేసిన18వ ఓవర్లో 4, 4, 6,6 బాదిన రిచా మరో 9 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్ ముగించింది. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 201/5 (గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 79 నాటౌట్‌‌‌‌‌‌‌‌, బెత్ మూనీ 56, 
రేణుకా సింగ్ 2/25)
ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ: 18.3 ఓవర్లలో 202/4 (రిచా 64 నాటౌట్‌‌‌‌‌‌‌‌, పెర్రీ 57, గార్డ్‌‌‌‌‌‌‌‌నర్ 2/33).