
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం(మే 04) గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గత రెండ్రోజులుగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. బనశంకరి, విజయనగరం, ఉల్సూరు, ఇందిరానగర్, ఫ్రేజర్ టౌన్‌లలోని ప్రజలు తొలకరి జల్లులతో ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందారు. శనివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడి ఉండటంతో నివేదికలు ఆర్‌సీబీ అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటివరకూ 10 మ్యాచ్‍ల్లో మూడింట(6 పాయింట్లు) విజయం సాధించిన బెంగళూరు జట్టుకు.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు డూ or డై వంటివి. అన్నింటా విజయం సాధిస్తే 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఎంతో కొంత ఆశలు పెట్టుకోవచ్చు. అదే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ మాత్రమే లభిస్తుంది. అప్పుడు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలిచిన.. 15 పాయింట్లు మాత్రమే ఉంటాయి. మరోవైపు, గుజరాత్ పరిస్థితి అంతే. ఆడిన 10 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించిన గిల్ సేనకు.. ఈ మ్యాచ్ కీలకం. విజయం సాధిస్తే..ప్లే ఆఫ్స్ రేసులో ఒక అడుగు ముందుకు వేయవచ్చు.
RCB vs GT వాతావరణ నివేదిక
Weather.com ప్రకారం.. శనివారం సాయంత్రం బెంగళూరులో పిడుగులు పడే అవకాశం 7 శాతం ఉంది. అలాగే, ఆట ప్రారంభానికి ముందు 1-2 శాతం చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వరుణుడు ఆటంకం కలిగించినా.. పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు. కావున అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు.
హెడ్ to హెడ్ రికార్డ్స్
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 4 సార్లు తలపడగా.. చెరో రెండింట గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి.
పిచ్ నివేదిక
చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. టాస్ గెలిచిన జట్లు ఎక్కువుగా బౌలింగ్ ఎంచుకోవడానికే మొగ్గు చూపుతాయి.
గుజరాత్ తుది జట్టు( అంచనా): వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.
బెంగళూరు తుది జట్టు( అంచనా): ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ , కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్.