RCB vs LSG: ఆర్‌సీబీదే టాస్.. తుది జట్టులో ఒకే ఒక మార్పు

ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఆడిన మూడింటిలో కేవలం ఒకే ఒక మ్యాచ్ నెగ్గిన ఆర్‌సీబీదే సేన.. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డుప్లెసిస్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేయనుంది. 

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఆర్‌సీబీ.. అల్జారీ జోసెఫ్ స్థానంలో రీస్ టాప్లీని జట్టులోకి తీసుకొచ్చింది. మరోవైపు, లక్నో వెన్నునొప్పి కారణంగా మోషిన్ ఖాన్‌ స్థానంలో యష్ ఠాకూర్‌కు చోటు కల్పించింది.   

తుది జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), రీస్ టాప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.

ALSO READ :- BAN vs SL: ఇలాంటి ఫీల్డింగ్ ఎప్పుడూ చూసి ఉండరు: క్రికెట్ మ్యాచ్‌లో ఫుట్ బాల్ సీన్