ఆర్సీబీతో కీలక పోరు.. ముంబైకి రెండు గుడ్ న్యూస్‎లు

ఆర్సీబీతో కీలక పోరు.. ముంబైకి రెండు గుడ్ న్యూస్‎లు

ముంబై: ఒక విజయం, మూడు పరాజయాలతో ఢీలా పడ్డ ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–18లో మరో కీలక పోరుకు రెడీ అయ్యింది. సోమవారం జరిగే లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బలమైన బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో నెగ్గాలంటే ముంబై బ్యాటర్లు తక్షణమే గాడిలో పడాలి. మోకాలి గాయంతో లక్నోతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ బలహీనంగా మారిన ముంబై బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఓ గుడ్‌‌‌‌‌‌‌‌న్యూస్‌‌‌‌‌‌‌‌. 

వెన్ను నొప్పి నుంచి కోలుకున్న స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా బరిలోకి దిగడం ఖాయమైంది. ఇక మిగతా బౌలర్లు కూడా అండగా నిలిస్తే ఆర్సీబీని కట్టడి చేయడం పెద్ద పని కాకపోవచ్చు. మరోవైపు రెండు విజయాలతో జోరుమీదున్న బెంగళూరు.. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది. దీంతో ముంబైపై కచ్చితంగా నెగ్గాలని భావిస్తోంది.