- విన్నర్‌కు లక్ష, రన్నరప్‌కు 50 వేల బహుమతి
మంచిర్యాల, వెలుగు: గురూస్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల మున్సిపల్ గ్రౌండ్లో పది రోజులగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ఆర్సీబీ జట్టు విజేతగా నిలిచింది. 8 ఫ్రాంచైజీలు 170 మందిని వేలం పాట ద్వారా ఎంపిక చేసుకొని నిర్వహించిన పోటీలు రసవత్తరంగా సాగాయి. ఫైనల్‌కు చేరుకున్న ఆర్సీబీ, సీఎస్కే జట్లు సోమవారం తలపడ్డాయి.
ఈ ఫైనల్మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. విన్నర్జట్టుకు లక్ష రూపాయల చెక్కును అంజనీపుత్ర సంస్థ యజమాని గుర్రాల శ్రీధర్‌తోపాటు పిల్లి రవి, రావుల ఉప్పలయ్య అందజేశారు. రన్నరప్‌కు తవక్కల్ విద్యాసంస్థల యజమాని అబ్దుల్ అజీజ్ రూ.50 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తూముల నరేశ్, కౌన్సిలర్లు బోలిశెట్టి కిషన్, తూముల ప్రభాకర్, క్రికెట్ పోటీల ఆర్గనైజర్లు బింగి దుర్గాప్రసాద్,శివకిరణ్, వైద్య ప్రశాంత్ క్రీడాకారులు పాల్గొన్నారు.