గుజరాత్‌‌‌‌కు ఆర్‌‌‌‌సీబీ షాక్‌‌‌‌.. 4 వికెట్ల తేడాతో నెగ్గిన రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌

గుజరాత్‌‌‌‌కు ఆర్‌‌‌‌సీబీ షాక్‌‌‌‌.. 4 వికెట్ల తేడాతో నెగ్గిన రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌
  • రాణించిన డుప్లెసిస్‌‌‌‌, కోహ్లీ..

బెంగళూరు: ఇరుజట్లకు ప్లే ఆఫ్​ బెర్త్‌‌‌‌ కీలకమైన నేపథ్యంలో రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు.. గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌కు షాకిచ్చింది. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో విరాట్‌‌‌‌ కోహ్లీ (23 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 42), డుప్లెసిస్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 64) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఆర్‌‌‌‌సీబీ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌‌‌‌పై నెగ్గింది. దీంతో సాంకేతికంగా నాకౌట్​ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

టాస్‌‌‌‌ ఓడిన గుజరాత్‌‌‌‌ 19.3 ఓవర్లలో 147 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. షారూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 37), రాహుల్‌‌‌‌ తెవాటియా (21 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 35), డేవిడ్ మిల్లర్‌‌‌‌ (20 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 30) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత బెంగళూరు13.4 ఓవర్లలో 152/6 స్కోరు చేసి నెగ్గింది. లిటిల్‌‌‌‌ 4 వికెట్లు తీశాడు. సిరాజ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

‘మిడిల్‌‌‌‌’ మాత్రమే..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన గుజరాత్‌‌‌‌ను బెంగళూరు బౌలర్లు బెంబేలెత్తించారు. స్టార్టింగ్‌‌‌‌లోనే సిరాజ్‌‌‌‌ (2/29) తన వరుస ఓవర్లలో సాహా (1), కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (2)ను ఔట్‌‌‌‌ చేయగా, ఆరో ఓవర్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌ (1/28) దెబ్బకు సాయి సుదర్శన్‌‌‌‌ (6) పెవిలియన్‌‌‌‌కు చేరాడు. దీంతో పవర్‌‌‌‌ప్లేలో జీటీ 23/3 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే టాప్‌‌‌‌  ఆర్డర్​ ఫెయిలైన పిచ్‌‌‌‌పై మిడిలార్డర్‌‌‌‌లో షారూక్‌‌‌‌, మిల్లర్‌‌‌‌, రాహుల్‌‌‌‌ ఫర్వాలేదనిపించారు. రెండు కీలక భాగస్వామ్యాలతో ఆ మాత్రం స్కోరైనా చేశారు. షారూక్‌‌‌‌, మిల్లర్‌‌‌‌ వీలైనప్పుడల్లా ఫోర్లు కొడుతూ మెల్లగా రన్‌‌‌‌రేట్‌‌‌‌ను మెరుగుపర్చారు.

10వ ఓవర్‌‌‌‌లో మిల్లర్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో జోరు పెంచడంతో జీటీ స్కోరు 61/3కి చేరింది. ఆ వెంటనే షారూక్‌‌‌‌ 6, 4తో బ్యాట్‌‌‌‌ ఝుళిపించినా, 12వ ఓవర్‌‌‌‌లో కర్న్‌‌‌‌ శర్మ (1/42) దెబ్బకొట్టాడు. టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌తో మిల్లర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో షారూక్‌‌‌‌ రనౌట్‌‌‌‌ కావడంతో స్కోరు 87/5గా మారింది. ఈ దశలో తెవాటియా 16వ ఓవర్‌‌‌‌లో 4, 6, 4, 4తో 19 రన్స్‌‌‌‌ దంచాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (18) రెండు ఫోర్లు రాబట్టాడు. కానీ 18వ ఓవర్‌‌‌‌లో యష్‌‌‌‌ దయాల్‌‌‌‌ (2/21) డబుల్‌‌‌‌ ఝలక్‌‌‌‌ ఇచ్చాడు. థర్డ్‌‌‌‌ బాల్‌‌‌‌కు రషీద్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి ఆరో వికెట్‌‌‌‌కు 44 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగించిన అతను లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు తెవాటియాను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. విజయ శంకర్‌‌‌‌ (10) రెండు ఫోర్లు కొట్టినా ఆఖరి ఓవర్‌‌‌‌లో విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (2/23).. మానవ్‌‌‌‌ సుతార్‌‌‌‌ (1) విజయ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయగా, మోహిత్‌‌‌‌ శర్మ (0) రనౌటయ్యాడు.

కోహ్లీ, డుప్లెసిస్‌‌‌‌ ధనాధన్‌‌‌‌

లక్ష్య ఛేదనలో కోహ్లీ రెండు సిక్స్‌‌‌‌లతో ఖాతా తెరిస్తే రెండో ఎండ్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌ రెండో ఓవర్‌‌‌‌లో 4, 4, 6, 4, తర్వాతి రెండు ఓవర్లలో ఐదు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌ దంచాడు. ఐదో ఓవర్‌‌‌‌లో కోహ్లీ మరో రెండు సిక్స్‌‌‌‌లు రాబట్టాడు. ఆరో ఓవర్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌ 4, 6, 4 కొట్టి ఐదో బాల్‌‌‌‌కు ఔటయ్యాడు. 18 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ కొట్టిన అతను తొలి వికెట్‌‌‌‌కు 92 రన్స్‌‌‌‌ జత చేశాడు.  7వ ఓవర్‌‌‌‌లో విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ (1)ను నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (2/23) ఔట్‌‌‌‌ చేస్తే 8వ ఓవర్‌‌‌‌లో జోష్‌‌‌‌ లిటిల్‌‌‌‌ నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (2), మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (4)ను పెవిలియన్‌‌‌‌కు చేర్చడంతో స్కోరు 107/4గా మారింది. ఆ వెంటనే వరుస విరామాల్లో గ్రీన్‌‌‌‌ (1), కోహ్లీ వెనుదిరిగినా కార్తీక్‌‌‌‌ (21 నాటౌట్‌‌‌‌) మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. అవతలి వైపు స్వప్నిల్‌‌‌‌ (15 నాటౌట్‌‌‌‌) రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో ఈజీగా విజయాన్ని అందించాడు.

సంక్షిప్త స్కోర్లు


గుజరాత్‌‌‌‌: 19.3 ఓవర్లలో 147 (షారూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌ 37, తెవాటియా 35, యష్‌‌‌‌ దయాల్‌‌‌‌ 2/21).

బెంగళూరు: 13.4 ఓవర్లలో 152/6 (డుప్లెసిస్‌‌‌‌ 64, కోహ్లీ 42, లిటిల్‌‌‌‌ 4/45).