జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేక.. సెంచరీతో  దంచికొట్టిన విల్ జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేక.. సెంచరీతో  దంచికొట్టిన విల్ జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌17 ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరిచిన రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరు సెకండాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదరగొడుతోంది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విల్ జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సూపర్ సెంచరీకి తోడు విరాట్ కోహ్లీ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మెరుపులతో వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 200/3 స్కోరు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (5), శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్ (16) నిరాశ పరిచినా.. సాయి సుదర్శన్ (49 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), షారూక్ ఖాన్ (30 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58) ఫిఫ్టీలతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 86 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి ఆదుకున్నారు.

చివర్లో మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (26 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మెరుపులతో జీటీ భారీ స్కోరు చేసింది. అనంతరం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ 16 ఓవర్లలోనే 206/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. తొలుత డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24)తో కోహ్లీ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 40 రన్స్ జోడించి పునాది వేశాడు. వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాక్స్ క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. అటువైపు కోహ్లీ తన జోరు కొనసాగిస్తూ 32 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి 17 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేసిన జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా గేరు మార్చాడు.  11వ ఓవర్లో 6,4తో హిట్టింగ్ షురూ చేసిన అతను..15వ ఓవర్లో 4, 6, 6, 6, 4తో చెలరేగాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 6,6,4,6,6తో రెచ్చిపోయి జట్టును గెలిపించాడు. 31 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ చేసిన జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో పది బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంకో యాభై రన్స్ రాబట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. 

సంక్షిప్త స్కోర్లు


గుజరాత్: 20 ఓవర్లలో 200/3 (సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 84*, షారూక్ 58, స్వప్నిల్ 1/23)
బెంగళూరు: 16 ఓవర్లలో 206/1 (విల్ జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100*, కోహ్లీ 70*, సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1/30)