CSK vs RCB: చెన్నైసూపర్ కింగ్స్పై..ఆర్సీబీ సూపర్ విక్టరీ

 CSK vs RCB: చెన్నైసూపర్ కింగ్స్పై..ఆర్సీబీ సూపర్ విక్టరీ

చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో RCB విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై  50 పరుగుల తేడాతో గెలిచింది.197 పరుగుల విజయ లక్ష్యంగా బరిలోకి దిగిన CSK టార్గెట్ రీచ్ అవడంలో విఫలమైంది. చైన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.సీఎస్ కే బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. మొదటనుంచి టపటపా వికెట్లు కోల్పోయిన CSK టార్గెట్ ఛేదించడంతో చతికిలపడింది. ఒక్క రచిన్ రవీంద్ర (41) , ధోనీ (30) పరుగులు తప్పా ఏ బ్యాటర్ కూడా ఎక్కువ స్కోరు చేయలేకపోయారు. చివరి ఓవర్లో ధోనీ వరుసగా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్లు:148(8 వికెట్లు). రచిన్ రవీంద్ర (41), ఎంఎస్ ధోని (30), రవీంద్ర జడేజా (25), శివం దుబే( 19), రవిచంద్రన్ అశ్విన్(11), రాహుల్ త్రిపాఠి (5), రుతురాజ్ గైక్వాడ్(0), దీపక్ హుడా( 4) , సాన్ కుర్రాన్ (8).

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టుకు 197 పరుగుల టార్గెట్ పెట్టింది. RCB కెప్టెన్ పాటిదార్ 51 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. ఫిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31, పడిక్కల్ 27 కొద్దిపాటి బ్యాట్ ఝులిపించగా.. మిగతా వాళ్లు ఏమాత్రం పెద్దగా ఆడలేదు. చివరి ఓవర్‌లో సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి స్కోరును 200 పరుగులకు దగ్గరగా తీసుకెళ్లాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరానా 2 వికెట్లు పడగొట్టగా, ఖలీల్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
 

Advertisement