ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఒక్క విజయమే సాధించిన డుప్లెసిస్ సేన.. నేడు (ఏప్రిల్ 15) సన్ రైజర్స్ తో కీలక పోరుకు సిద్ధమవుతుంది. వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయిన బెంగళూరుకు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. సొంతగడ్డపై వరుసగా ఓడిపోవడం నిరాశకు గురి చేస్తుంది. ఒకవేళ ఆర్సీబీ నేడు జరిగే మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్ కు చేరుతుందా అనే విషయాన్ని పరిశీలిద్దాం.
టోర్నీలో ఒక జట్టు 14 మ్యాచ్ లు చొప్పున ఆడుతుంది. ఒక జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆర్సీబీ ఆరు మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించింది. ఈ రోజు సన్ రైజర్స్ చేతిలో ఓడితే 7 మ్యాచ్ లు మిగిలి ఉంటాయి. అప్పుడు మిగిలిన 7 మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ రోజు గెలిస్తే మిగిలిన 7 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ ల్లో గెలవాలి. ఏదైనా నేడు బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్ కు చేరడం దాదాపు అసాధ్యం.
ఐపీఎల్ లో అన్ని బలమైన జట్లే. ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాలంటే శక్తికి మించిన పని. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన జోష్ లో ఉంది. ఇప్పటివరకు ఆరెంజ్ ఆర్మీ ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడు విజయాలను సాధించింది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ముందుకెళ్లాలని చూస్తుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమమవుతుంది.
IPL 2024: RCB vs SRH#IPL2024 #RCBvSRH #RoyalChallengersBengaluru #SunrisersHyderabad #Cricket pic.twitter.com/Pp8zjFutqV
— MyKhel Malayalam (@myKhelMalayalam) April 15, 2024