RCB vs GT: హోం గ్రౌండ్లో చేతులేత్తేసిన కోహ్లీ, పటిదార్.. కష్టాల్లో ఆర్సీబీ

RCB vs GT: హోం గ్రౌండ్లో చేతులేత్తేసిన కోహ్లీ, పటిదార్.. కష్టాల్లో ఆర్సీబీ

ఐపీఎల్ 18 సీజన్‎లో భాగంగా బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‎తో జరుగుతోన్న మ్యాచులో ఆర్సీబీ టాపార్డర్ చేతులేత్తేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో సొంతగడ్డపై ఆర్సీబీ టాపార్డర్ కుప్పకూలింది. లీగ్ తొలి రెండు మ్యాచుల్లో పవర్ ప్లేలో భారీ పరుగులు చేసిన ఆర్సీబీ.. ఈ మ్యాచులో మూడు వికెట్లు కోల్పోయి 36 రన్సే చేసింది. ఈ మ్యాచులో టాస్ ఓడి ఆర్సీబీ మొదట బ్యాటింగ్‎కు దిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (7) నిరాశపర్చాడు. 

కోహ్లీ తొలి ఓవర్లోనే ఫోర్ట్ కొట్టి జోష్‎లో కనిపించగా ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సెకండ్ ఓవర్లోనే బ్యాక్ స్వేర్ లెగ్‎లో షాట్‎కు యత్నించిన యంగ్ బౌలర్ అర్షద్ ఖాన్ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించాడు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‎లో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ పటిదార్, ఓపెనర్ సాల్ట్ ఆచీతూచీ ఆడారు. కానీ వరుస ఓవర్లో వీరిద్దరి ఔట్ అయ్యారు.

12 పరుగులు చేసిన పటిదార్ ఇషాంత్ శర్మ బౌలింగ్‎లో ఎల్బీ రూపంలో ఔట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి స్పీడ్ పెంచిన సాల్ట్.. ఆ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 9.3 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో జితేశ్ శర్మ (23), లివింగ్ స్టోన్ (8) ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.