RCB vs PBKS: కోహ్లీ, సాల్ట్, లివింగ్ స్టోన్ ఔట్.. పీకల్లోతూ కష్టాల్లో ఆర్సీబీ

RCB vs PBKS: కోహ్లీ, సాల్ట్, లివింగ్ స్టోన్ ఔట్.. పీకల్లోతూ కష్టాల్లో ఆర్సీబీ

బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా పంజాబ్‎తో జరుగుతోన్న మ్యాచులో ఆర్సీబీ పీకల్లోతూ కష్టాల్లో పడింది. వర్షం కారణంగా పిచ్ బ్యాటింగ్‎కు అనూకూలించకపోవడంతో ఆర్సీబీ టాపార్డర్ కుప్పకూలింది. స్టార్ బ్యాటర్ సాల్ట్ (4), కోహ్లీ (1), లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ (2) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. వచ్చిన వారు వచ్చినట్టే మళ్లీ పెవిలియన్‎కు క్యూ కట్టారు. పిచ్‎పై ఉన్న తేమను పంజాబ్ బౌలర్లు అద్భుతంగ వినియోగించుకున్నారు. ముఖ్యంగా పంజాబ్ స్టార్ పేసర్ అర్షదీప్  సింగ్ నిప్పులు చెరిగాడు.

 డేంజరస్ సాల్ట్, కోహ్లీ వికెట్లను తీశాడు. చాహల్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి జితేశ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. బార్ట్ లెట్ బౌలింగ్‎లో లివింగ్ స్టోన్ క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం మార్కో జెన్ సెన్ బౌలింగ్లో కృనాల్ వికెట్ పారేసుకున్నాడు. ఆర్సీబీ ప్రస్తుతం 6.4 ఓవర్లకు 39 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ పటిదార్ 22, టిమ్ డేవిడ్ 5 ఉన్నారు.