ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డేంజర్ జోన్ లో పడింది. అన్ని జట్ల కంటే వెనకపడిన ఆర్సీబీకు నేటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో నేడు (ఏప్రిల్ 21) అమీతుమీ తేల్చుకోనుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇప్పటివరకు ఆర్సీబీ 7 మ్యాచ్ లాడితే కేవలం ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ బెంగళూరు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి.
టోర్నీలో ఒక జట్టు 14 మ్యాచ్ లు చొప్పున ఆడుతుంది. ఒక జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆర్సీబీ 7 మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించింది. ఈ రోజు కేకేఆర్ చేతిలో ఓడితే 6 మ్యాచ్ లు మిగిలి ఉంటాయి. అప్పుడు మిగిలిన 6 మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచినా ప్లే ఆఫ్ కు వెళ్లడం కష్టం. ఈ రోజు గెలవడంతో పాటు మిగిలిన 6 మ్యాచ్ ల్లో గెలవాలి. దీంతో ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ గా మారింది. ఏదైనా నేడు బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్ కు చేరడం దాదాపు అసాధ్యం.
ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్నా బౌలింగ్ విభాగం అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, దినేష్ కార్తీక్ ఫామ్ లో ఉండడం కలిసి వచ్చే అంశం. అయితే ఏ ఒక్క బౌలర్ కూడా నిలకడగా రాణించలేకపోతున్నాడు. అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బౌలింగ్ విభాగంలో ఎన్ని మార్పులు చేసినా ఫలితం లేకుండా పోతుంది. మరి నేడు జరగనున్న మ్యాచ్ లో గెలిచి రేస్ లో ఉంటుందో లేకపోతే టోర్నీ నుంచి వైదొలుగుతుందో చూడాలి.
All eyes now with #KKRvsRCB match 💥
— Cine Flow 🧘🏻♂️ (@CineFlowTamil) April 21, 2024
The 2nd match between #KKR and #RCB today 🔥
Can #RoyalChallengersBangalore won this time with #KolkataKnightRiders ❤️🔥
The rivalry #ViratKohli and #GautamGambhir
happens#KKRvRCB pic.twitter.com/dz9MPzHLvt