IND vs ENG: ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. RCB ఫ్యాన్స్‌ను ఇలా ట్రోల్ చేస్తున్నారేంట్రా

IND vs ENG: ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. RCB ఫ్యాన్స్‌ను ఇలా ట్రోల్ చేస్తున్నారేంట్రా

ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ లో ఇంగ్లీష్ జట్టు దారుణంగా నిరాశపరిచింది. ఒక్క బట్లర్ ను మినహాయిస్తే మిగిలినవారు పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత గడ్డపై వచ్చి అనుభవం లేని ఇంగ్లాండ్ బ్యాటర్లు విఫలమవడం సహజం. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా తొలి టీ20లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ విఫలం కావడంతో  ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు ఆ జట్టును ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 

బుధవారం (ఫిబ్రవరి 22) భారత్ తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో ముగ్గురు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్, బ్యాటింగ్ ఆల్ రౌండర్లు లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ జట్టు తరపున ఆడనున్నారు. ఈ త్రయం బ్యాటింగ్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సాల్ట్, లివింగ్‌స్టోన్ డకౌట్ కాగా..  బెథెల్ 7 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో బెంగళూరు జట్టుకు అప్పుడే దరిద్రం స్టార్ట్ అయిందని.. భారీ మొత్తంలో ఈ ఇంగ్లీష్ ఆటగాళ్లను కొనుగోలు చేసి తప్పు చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. 

ALSO READ : Ranji Trophy 2025: 3 పరుగులకే రోహిత్ ఔట్.. స్టేడియం వదిలి వెళ్లిన ఫ్యాన్స్

2024 మెగా ఆక్షన్ లో ఆర్సీబీ బ్యాడ్ లక్ కొనసాగుతుందని.. వచ్చే ఏడాది కూడా ఆ జట్టు టైటిల్ సాధించడం కష్టమేనని అంటున్నారు.     2024 సీజన్ లో కేకేఆర్ జట్టు తరపున అద్భుతమైన ప్రదర్శన చేసి సూపర్ ఫామ్ లో ఉన్న సాల్ట్ ను మెగా ఆక్షన్ లో ఆర్సీబీ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేశారు. లియామ్ లివింగ్‌స్టోన్ కు రూ. 8.75 కోట్లు.. రైజింగ్ స్టార్ జాకబ్ బెథెల్ రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది. వీరు ముగ్గురు తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రదర్శన ఐపీఎల్ లో ఈ ఇంగ్లీష్ త్రయం చేస్తే మరోసారి ఆర్సీబీ టైటిల్ ఆశలు వదులుకోవాల్సిందే.