టెక్నాలజీ : ఫోటోలు, వీడియోలు మెసేజ్ లోనే పంపచ్చు.. వాట్సాప్ అవసరం లేదు..

ఫొటోలు, వీడియోలు, ఆడియోలు వాట్సాప్​లో షేర్ చేసుకుంటున్నాం. అయితే మెసేజెస్ యాప్ కూడా ఈ సర్వీస్​లను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్​ (ఆర్​సీఎస్)​ని తీసుకొచ్చింది. ఇక నుంచి ఎస్​ఎంఎస్, ఎంఎంఎస్ ద్వారా టెక్స్ట్​ మెసేజ్​లు మాత్రమే వాడేవాళ్లు. అదే ఆర్​సీఎస్​లో రీడ్ రిసిప్ట్స్, టైపింగ్ ఐకాన్స్, హై క్వాలిటీ మీడియా షేర్, గ్రూప్ చాట్స్ వంటి రకరకాల ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీని ఇతర యాప్​లను డౌన్​లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్ డిఫాల్ట్​ మెసేజెస్ యాప్​తోనే నచ్చిన మెసేజ్​లు సెండ్ చేయొచ్చు. 

ఎనేబుల్ ఇలా..

ఈ ఫీచర్​ని ఎనేబుల్ చేయాలంటే డిఫాల్ట్​ మెసేజెస్ యాప్​ ఓపెన్ చేసి, కుడివైపు పైన కనిపించే ప్రొఫైల్ పిక్చర్​ మీద ట్యాప్ చేయాలి. తర్వాత మెసేజెస్ సెట్టింగ్స్​లోకి వెళ్లి ఆర్​సీఎస్ చాట్స్ మీద ట్యాప్ చేయాలి. ఎడమవైపు బటన్​ని ట్యాప్ చేసి టర్న్​ ఆన్ చేయాలి. ఫోన్​ నెంబర్​ కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు స్టేటస్ కనెక్టెడ్​ అని చూపిస్తుంది. ఐఒఎస్​ 18, ఆ తర్వాతి ఫోన్లకు మెసేజెస్​ సెట్టింగ్స్ ద్వారా దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్​ను ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తూ యాప్స్​లో మెసేజెస్​ను సెలక్ట్ చేయాలి. టెక్స్ట్ మెసేజింగ్ మెనులో కింద ఆర్​సీఎస్ మెసేజింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. బటన్​ని ఆన్ చేస్తే ఎనేబుల్ అవుతుంది.