భద్రాచలం, వెలుగు : గోదావరి వరదలతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని తీర ప్రాంత ఆఫీసర్లను ఆర్డీవో దామోదర్ ఆదేశించారు. ఆర్డీవో ఆఫీసులో మంగళవారం నేషనల్ డిజస్టర్ రెస్పాన్స్ టీమ్ సారధ్యంలో గోదావరి వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడు మండలాల తహసీల్దార్లు, సెక్టోరియల్ఆఫీసర్లు, పోలీసులతో రివ్యూ మీటింగ్ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఆఫీసర్లంతా అలర్ట్ గా ఉండాలన్నారు. తీర ప్రాంతంలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులకు మండల స్థాయిలో ఆఫీసర్లు హాజరు కావాలన్నారు. ఈ రివ్యూ మీటింగ్లో జాతీయ విపత్తుల స్పందన దళం కమాండర్భూపేందర్ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.