నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : రాజాగౌడ్

బోధన్, వెలుగు: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని  ఆర్డీవో రాజాగౌడ్ హెచ్చరించారు. మంగళవారం  ఆర్డీవో ఆఫీసులో పోలిటికల్ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్​ అమలులో ఉండడంతో రూ.50వేల కంటే ఎక్కువ  డబ్బులు, మద్యం , గంజాయి వంటి పదార్థాలు రవాణా చేయరాదన్నారు. డివిజన్​లోని పోతంగల్​, సాలూర, ఖండ్​గావ్, కందకుర్తి ప్రాంతాలలో చెక్​పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో  ఏసీపీ కిరణ్​కుమార్​  తహసీల్దర్లు గంగాధర్​, మోతీసింగ్​, నారాయణ,  సీఐలు ప్రేమ్​ కుమార్​,   శ్రీనివాస్​రాజ్​,  అధికారులు , వివిధ పార్టీల లీడర్లు  పాల్గొన్నారు.