బాల్కొండ, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని ఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం బాల్కొండ తహసీల్దార్ ఆఫీస్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. 1181 సర్వే నెంబర్‌లోని శ్మశాన వాటిక స్థలం సమస్యను పరిష్కరించాలని పద్మశాలీ కులస్థుల అభ్యర్థన మేరకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల నుంచి ఆ స్థలంలోనే సమాధులు ఉన్నాయని అధికారులు వివరించారు.
1333 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం నలుగురు సర్వేయర్లను నియమించామన్నారు. ప్రభుత్వ భూములను ప్రజలే కాపాడుకోవాలని, రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు.