
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సదాశివపేట గ్రామంలో ఖననం చేసిన మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 20న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సుభద్రకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. తర్వాత ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలువ్యక్తం చేయడంతో ఖననం చేసిన తర్వాత నవంబర్11న డెడ్‌బాడీని పోస్టుమార్టం చేశారు.
అప్పట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా గతనెల 15న పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య హత్య జరిగింది. ఈ కేసులో గోపాల్ నగర్ గ్రామానికి చెందన జనగామ వైస్ జడ్పీ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త గిరబోయిన అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
రామకృష్ణయ్య హత్యతో పాటు సుభద్రను కూడా తానే హత్య చేసినట్లు అంజయ్య ఒప్పుకున్నాడు. దీంతో సుభద్ర డెడ్‌బాడీ రీ పోస్టుమార్టానికి వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య కేఎంసీ ఫోరెన్సిక్ నిపుణులు పోస్ట్ మార్టం నిర్వహించి ఫొటోలు తీసుకొని, ఆధారాలు తీసుకెళ్లారు.