సెస్ ఫలితాలు: వేములవాడ రూరల్లో రీకౌంటింగ్

రాజన్న సిరిసిల్ల : సెస్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ రూరల్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారని ఎన్నికల అధికారి మమత ప్రకటించిన కాసేపటికే రీకౌంటింగ్కు ఆదేశించారు. ఫలితంపై అభ్యంతరం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నేతలు రీకౌంటింగ్కు పట్టుబట్టారు. దీంతో 15 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల అధికారి ఓట్లు మళ్లీ లెక్కించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతల లాబీయింగ్కు ఎన్నికల అధికారి తలొగ్గారని, పోలీసులు ఇతర అధికారులు సైతం వారికే మద్దతు తెలుపుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రీకౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కౌంటింగ్ కేంద్రం నుంచి అందరినీ బయటకు పంపిస్తున్నారు. 
బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 1379, బీఆర్ఎస్ అభ్యర్థికి 1372 ఓట్లు వచ్చాయి. 7 ఓట్ల తేడాతో  బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. అయితే ఫలితం ప్రకటించిన 15 నిమిషాల్లోనే ఎన్నికల అధికారి రీకౌంటింగ్ కు ఆదేశించారు.