
ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ జరుగనుంది. ఇందుకుగాను ఈసీ పంచజెండా ఊపింది. ఏపీలోని కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు, మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పటికే ఐదుచోట్ల రీపోలింగ్ జరపాలని ఏపీ ఎన్నికల చీఫ్ జీకే ద్వివేది ఈసీకి సిఫారసు చేశారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు సిఫారసు చేయగా ఈసీ అందుకు ఒప్పుకుంది.
రీపోలింగ్ జరిగే కేంద్రాలు ఇవే..
గుంటూరు జిల్లా:
నరసరావుపేట నియోజకవర్గంలోని 94వ పోలింగ్ సెంటర్
గుంటూరు పశ్చిమలోని నల్లచెరువు 244వ సెంటర్
నెల్లూరు జిల్లా:
పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ సెంటర్
సూళ్లూరు పేటలోని అటకానితిప్ప 197వ సెంటర్
ప్రకాశం జిల్లా:
యర్రగొండపాలెం కలనూతల 247వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.