- వలస కార్మికుడు మృతి
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
- జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ఏరియాలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌పేలి ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఇండస్ట్రియల్ఏరియా ఫేజ్–4లో గతంలో మైలాన్పేరుతో కంపెనీ నడిచింది. అందులో ప్రస్తుతం ఆరోర్పేరుతో ఫార్మా సూటికల్స్ కంపెనీ కొనసాగుతోంది. ఇందులో ఏపీలోని అనంతపూర్, గుత్తి నుంచి వలసవచ్చి సూరారం కాలనీలో ఉంటున్న అనిల్‌కుమార్ యాదవ్(42), సూరారం కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (46), బలరాం(51) క్యాజువల్ లేబర్‌గా, చింతల్‌కి చెందిన గోపిచంద్(30) కెమిస్ట్‌గా పనిచేస్తున్నారు. రోజూలాగే వీరంతా బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లారు. కంపెనీలోని రియాక్టర్ వద్ద పనిచేస్తుండగా, సరిగ్గా 9.30 గంటలప్పుడు రియాక్టర్పేలింది. ఈ ప్రమాదంలో అనిల్‌కుమార్ యాదవ్ అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీనివాస్‌రెడ్డి, బలరాం, గోపిచంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషయమంగా ఉన్నట్లు సమచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాజమాన్యంపై ఆగ్రహం
రియాక్టర్బ్లాస్ట్పై కంపెనీ యాజమాన్యం వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకరు చనిపోయి, ముగ్గురు తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని కార్మికుల బంధవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున ప్రమాదం జరిగితే మధ్యాహ్నం దాకా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఒత్తిడి పెరగడంతో సూరారం పోలీసులకు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఫైర్‌స్టేషన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. తమకు సమాచారం రాలేదని జీడిమెట్ల ఫైర్ఆఫీసర్శేఖర్రెడ్డి చెప్పడంతో తమ అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు. ఆయనే స్వయంగా పరిశ్రమ వద్దకు వచ్చి పరిశీలించారని చెప్పారు. కాగా కార్మికుల కుటుంబ సభ్యులను, మీడియాను కంపెనీలోకి రానివ్వలేదు. ఒకరిద్దరిని మాత్రమే అనుమతిచ్చారు. ఈ కంపెనీలో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. పలువురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇన్స్పెక్టర్ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.