నల్గొండ హిండిస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని హిండిస్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కంపెనీ చుట్టుపక్కల భారీగా పొగ కమ్మేసింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఫ్యాక్టరీ లోపలికి ఎవరిని అనుమతించటం లేదు. 

కాగా కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భారీగా కమ్ముకున్న పొగతో వెలిమినేడు, పిట్టంపల్లి, బాంగోని చెర్వు, పేరేపల్లి, గుండ్రంపల్లి, పెద్దకాపర్తి సమీప గ్రామస్తుల భయాందోళనకు గురయ్యారు