తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ప్రింటింగ్ కాలేజీ మూసివేత!

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ప్రింటింగ్ కాలేజీ మూసివేత!

ప్రింటింగ్ మార్కెట్​కు సంబంధించి ఎంతో మందినిపుణులను అందించిన సికింద్రాబాద్ లోని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌‌‌‌ టెక్నాలజీ కాలేజీ(జీఐపీటీ)మూసివేతకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలోఉన్న ఏకైక సర్కారీ ప్రింటింగ్‌‌‌‌ కాలేజీ ఇదే.తెలుగు రాష్ట్రాల్లో ని అన్ని న్యూస్ పేపర్ల ప్రింటింగ్‌‌‌‌ విభాగంలో పనిచేస్తున్న వారిలో చాలా మంది ఇక్కడ చదివిన వారే. అయితే వచ్చే ఏడాది నుంచి జీఐపీటీలో-ప్రవేశాలు నిలిపేస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది.

రెండు కోర్సుల విలీనం

1977లో సికింద్రాబాద్‌‌‌‌ ఈస్ట్​ మారేడ్ పల్లిలో జీఐపీటీఏర్పాటైంది. అప్పటి అవసరాలరీత్యా డిప్లొమా ఇన్‌ప్రింటింగ్‌‌‌‌ టెక్నాలజీ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. మూడేండ్ల డిప్లొమా కోర్సులో ఏటా 120 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు . అయితే ప్రింటింగ్ ,ప్యాకేజింగ్ కు వేర్వేరు కోర్సులు ఉండటంతో వీటిని విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఐపీటీలోని ప్రింటింగ్‌‌‌‌ టెక్నాలజీ కోర్సును, రామంతాపూర్‌‌‌‌ పాలిటెక్నిక్‌‌‌‌ కాలేజీలోని డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సును విలీనం చేసి డిప్లొమా ఇన్‌ ప్రింటింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్యాకేజింగ్‌‌‌‌ టెక్నాలజీ కోర్సుగా మార్చాలని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌‌‌‌ నవీన్‌ మిట్టల్‌ విద్యాశాఖ కార్యదర్శికి ఫిబ్రవరి 22న లేఖ రాశారు. దీనికివిద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఆమోదించారు.కొత్త కోర్సులో 120 సీట్లకు అనుమతిస్తూ ఈ నెల 2న మెమో జారీ చేశారు. ప్రస్తుతం ఈ ప్రపోజల్​ను ఏఐసీటీఈ అప్రూవల్​ కోసం పంపుతున్నామని, అనుమతి తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెడతామని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు .

మూతపడనున్న జీఐపీటీ

వచ్చే విద్యాసంవత్సరం సెకండ్, థర్డ్‌‌‌‌ ఇయర్‌‌‌‌ విద్యార్థులతో జీఐపీటీ కాలేజీ కొనసాగనుంది. మరో రెండేళ్లలో కాలేజీ మూత పడనుంది. మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కాలేజీని కారణం లేకుండా మూసేయడాన్ని సిబ్బంది, స్టూడెంట్స్‌‌‌‌ వ్యతిరేకిస్తున్నారు . దీనిపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డిని తెలంగాణ ఆఫ్‌ సెట్‌ప్రింటర్స్‌‌‌‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి కాలేజీని కొనసాగించాలని కోరారు. స్పందించిన మంత్రి.. అధికారుల నుంచి నివేదిక కోరినట్టు తెలిసింది. దీంతో మరోసారి కాలేజీని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.