
జనసేన పార్టీ తరుపున ప్రచారం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లుగా నటి అనసూయ తెలిపారు. తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని.. ఒకవేళ తనని పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తానని చెప్పుకొచ్చింది. తనకు లీడర్స్ ముఖ్యం కానీ పార్టీలు కాదంది. వాళ్ల అజెండాలు నచ్చితే మద్దతిస్తానని తెలిపింది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తనని ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది అనసూయ.
డేట్స్ సర్దుబాటుకాకపోవడం వల్లే జబర్దస్త్ మానేశాననంటుంది అనసూయ. ఇప్పటికీ కుదిరినప్పుడల్లా సెట్స్‌కు వెళ్తుంటానని తెలిపింది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో తన డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ పై అనసూయ స్పందించింది.
కొంచెం పాతకాలం వ్యక్తి కాబట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదమో.. తనపై ఉన్న చనువుతో పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం నచ్చలేదని ఆయన అభిప్రాయాన్ని చెప్పారంది. కోట చాలా పెద్దవారని.. సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో ఆయన చేసినట్లు ఎవరూ చేయలేరని చెప్పుకొచ్చింది.