
- ప్రిపరేషన్స్‌లో మన సైన్యం
- ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్
న్యూఢిల్లీ:పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు మన సైన్యం రెడీగా ఉంది. అన్ని రకాల ప్రిపరేషన్స్‌ను కొనసాగిస్తున్నది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి తెలియజేశారు.
సోమవారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్అనిల్ చౌహాన్‌తో ఆదివారం తాను చర్చించిన అంశాలను మోదీకి రాజ్‌నాథ్ వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం ప్రిపరేషన్స్‌లో ఉందని పేర్కొన్నారు.