చాట్ జీపీటీ పేరుతో కృత్రిమ మేధను సామాన్యులకూ అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ గూగుల్‌కు పోటీగా అత్యంత శక్తిమంతమైన కృత్రిమ మేధ సెర్చింజన్ సెర్చ్ జీపీటీను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ సెర్చింజన్, ఓపెన్ ఏఐ ఇప్పటికే రూపొందించిన చాట్ జీపీటీకి, చాట్‌బాట్‌కు అనుసంధానమై పనిచేస్తుంది.