MRO ఆఫీసులో కొట్టుకున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు

MRO ఆఫీసులో  కొట్టుకున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు
  • మర్పల్లి తహసీల్దార్ ఆఫీసులో ఘటన

వికారాబాద్, వెలుగు: జిల్లాలో తహసీల్దార్ ఆఫీసులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అడ్డాగా మారాయి. ధరణి వచ్చినప్పటి నుంచి భూముల ధరలు పెరగడంతో అదే స్థాయిలో వివాదాలు కూడా ఎక్కువయ్యాయి. శుక్రవారం మర్పల్లి తహసీల్దార్ ఆఫీసులో  సిరిపురం గ్రామానికి చెందిన ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. 

దీనిపై తహసీల్దార్ గణేశ్​ను  వివరణ కోరగా.. తాను చాంబర్ లో ఉన్నానని, ఆర్ఐ గదిలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారని చెప్పారు. పక్క గదిలో గొడవ జరుగుతున్నట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.  పోలీసులు వచ్చి వారిని స్టేషన్ కు తీసుకెళ్లినట్టు వివరించారు.