కామేపల్లి, వెలుగు : ఏజెన్సీలో చట్టాలను ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ కొండాయిగూడెం రెవెన్యూలో రూ.కోట్ల విలువైన 4 ఎకరాల వ్యవసాయ భూమిలో కొందరు వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం షురూ చేశారు. అధికారులను నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆ భూమిలోని కొబ్బరి చెట్లను నరికారు. వ్యర్థాలను పక్కనే ఉన్న చాకిరాయి కుంట చెరువులో పోశారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు కనీసం స్పందించడం లేదు.
ఏజెన్సీలో వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చితే వాటిని గిరిజనులకే అమ్మాల్సి ఉంటుంది.. కానీ ఇక్కడ అన్నీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. దీనిపై లంబాడీ హక్కుల పోరాట సమితి నేతలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్ సుధాకర్ ను వివరణ కోరగా తమకు విషయం తెలియగానే కొండాయిగూడెం రెవెన్యూ పరిధిలోని సంబంధిత రైతును పిలిపించి మాట్లాడామన్నారు.
తాను తన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మలేదన్నాడని చెప్పారు. సంబంధిత రైతు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.