ప్రీ లాంచ్, బై బ్యాక్ పేరుతో రియల్ మోసాలు

ప్రీ లాంచ్, బై బ్యాక్ పేరుతో రియల్ మోసాలు
  • బయటపడుతున్న వందల కోట్ల స్కామ్​లు
  • నిండా మునుగుతున్న సామాన్యులు.. విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు
  • నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం
  • ‘త‌‌ర‌‌త‌‌రాల‌‌కు చెర‌‌గ‌‌ని చిరునామా’ అంటూ కుచ్చుటోపీ
  • సాహితీ ఇన్‌‌ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ!
  • ఏడాదిన్నరలో రూ.4 వేల కోట్ల మోసాలు వెలుగులోకి
  • కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్​

హైదరాబాద్, వెలుగు: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని రియల్​ ఎస్టేట్​ సంస్థలు ప్రీ లాంచ్​లు, బై బ్యాక్​ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. అందినకాడికి కొల్లగొడ్తున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి.. చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి.  హైదరాబాద్​ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సాహితీ ఇన్‌‌ఫ్రా, భారతీ బిల్డర్స్‌‌, ఆర్​జే గ్రూప్‌‌ మొదలు.. తాజాగా సువర్ణ భూమి ఇన్​ఫ్రా డెవలపర్స్​ వరకు ఈ లిస్ట్​లో చేరాయి. క్యూలో ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి. ఏండ్ల తరబడి తమ నడుమనే ఉంటూ నమ్మించి, డబ్బులు కట్టించుకొని.. ఉన్నట్టుండి బిచాణా ఎత్తేస్తుండటంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీస్‌‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ.. కేసులు పెడుతూ అలసిపోతున్నారు. వందల కోట్లు వసూలు చేసిన నిందితులేమో కుటుంబాలతో విదేశాలకు పారిపోతు న్నారు.  ఏడాదిన్నరలో రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్ల మేర రియల్​ ఎస్టేట్​ మోసాలు జరిగినట్లు ఓ అంచనా. రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ), రెరా అప్పిలేట్ అథారిటీలు ఉన్నప్పటికీ ఇలాంటి విషయాల్లో బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. రియల్​ ఎస్టేట్​ మోసాలపై సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​ అయినట్లు తెలిసింది. ప్రీ లాంచ్​లు, బై బ్యాక్​లు వంటివి జరగకుండా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తున్నది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులు కట్టిన సొమ్మును ఎలా రికవరీ చేయించాలనే దానిపై ఫోకస్​ పెట్టింది. 

ఎంక్వైరీలు చేయకుండానే పెట్టుబడి పెట్టి..!

ప్రీ లాంచ్,  బై బ్యాక్​ ఆఫర్లు  రెరా రూల్స్​కు  పూర్తిగా విరుద్ధం. కానీ, కొన్ని కంపెనీలు వీటినే నమ్ముకొని మోసం చేస్తున్నాయి.  రెరా అడ్డుకోవాల్సి ఉండగా.. అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి.  ప్రీ లాంచ్​ పేరుతో యాట్రాక్టివ్‌‌‌‌‌‌‌‌ యాడ్స్‌‌‌‌‌‌‌‌.. సినీ స్టార్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ సెలబ్రిటీలతో పెద్ద ఎత్తున రియల్​ కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రీ లాంచింగ్ ఆఫర్లు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఊరించేలా బై బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఆఫర్లు కనిపిస్తుండటంతో ఎంక్వైరీలు చేయకుండానే సామాన్యులు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా మోసగాళ్ల చేతికి చిక్కేస్తున్నారు. సాహితి ఇన్​ఫ్రా, జయ గ్రూప్‌‌‌‌‌‌‌‌-,  మైత్రి ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌-, భువన్‌‌‌‌‌‌‌‌తేజ, ఒబ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా, భారతి బిల్డర్స్‌‌‌‌‌‌‌‌, అర్బన్‌‌‌‌‌‌‌‌ ఉడ్ రియాల్టీ లాంటి రియల్​ కంపెనీల మోసాలు బాధితులు రోడ్డెక్కడంతో వెలుగులోకి వచ్చాయి. 

భారీ ప్రకటనలు, వచ్చినోళ్లకు బిర్యానీలు

సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ప్రతి వారం సొంత వాహనాల్లో వెంచర్​, ఫామ్​ టూర్ల పేరుతో తీసుకెళ్తున్నారు. 
అక్కడే టెంట్లు వేసి బిర్యానీలు కూడా వడ్డిస్తున్నారు. ప్రత్యేక కాల్​ సెంటర్లను పెట్టుకుని.. వివిధ ప్రాంతాల నుంచి ఫోన్​ నంబర్లు సేకరించి ఫోన్లు చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తూ బుట్టలో వేసుకుంటున్నారు. ఆ భారీ ప్రచారాన్ని చూసి నమ్మి మధ్యతరగతి ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును రియల్​ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నారు. ఇదే అదునుగా కొన్ని రియల్​ ఎస్టేట్​ సంస్థలు.. తాము అనుకున్నంత  సొమ్ము చేతికందగానే మొహం చాటేస్తున్నాయి. 

సీరియస్ గా తీసుకున్న సీఎం

రియల్​ ఎస్టేట్​వ్యాపారుల మోసాలను సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​గా తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెరాకు అప్పిలేట్​ ట్రిబ్యునల్​ ను నియమించారు. అదే సమయంలో 40 పోస్టులను కూడా ట్రిబ్యునల్​కు మంజూరు చేశారు. ఇప్పుడు మోసపోతున్న బాధితులకు తిరిగి ఆయా కంపెనీల నుంచే ఎలా రికవరీ ఇప్పించేలానే దానిపై లీగల్​ ఓపినియన్​ తీసుకుంటున్నట్లు తెలిసింది.  ఇలాంటి మోసాలు జరగకుండా ఇంకా కఠిన చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందనే దానిపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.  రెరా చట్టం ప్రకారం.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70 శాతాన్ని ప్రత్యేక అకౌంట్‌‌‌‌‌‌‌‌లో పెట్టాలి. నిర్మాణం, భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఈ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారు. సేల్ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేసే ముందు.. డెవలపర్లు, బిల్డర్లు ఆస్తి ఖర్చులో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్‌‌‌‌‌‌‌‌గా అడిగే అవకాశం లేదు. ఇక బిల్డర్లు తాము చేపట్టే అన్ని ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలి. కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డర్లు ప్లాన్లలో ఎలాంటి మార్పులు కూడా చేయరాదు. కానీ ఇవ్వన్నీ ఏమి పట్టించుకోని రియల్​ ఎస్టేట్​ కంపెనీలు  నచ్చిన పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తూ చివరికి  బోర్డును తిప్పేస్తున్నాయి. ఆ సొమ్ముతో వాటి యాజమానులు విదేశాలకు ఉడాయిస్తున్నారు. 

నాలుగేండ్లయినా ఇండ్లు కట్టియలే!

ప్రీ లాంచింగ్​ పేరుతో ఆర్‌‌‌‌‌‌‌‌జే గ్రూప్ అనే సంస్థ సుమారు 600 మందిని ముంచింది. వారి నుంచి దాదాపు రూ.150 కోట్లను వ‌‌‌‌‌‌‌‌సూలు చేసింది. నారాయణ్ ఖేడ్, ఘట్‌‌‌‌‌‌‌‌కేస‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, పఠాన్ చెరు, క‌‌‌‌‌‌‌‌ర్దనూరు వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట వెంచ‌‌‌‌‌‌‌‌ర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేసింది.  ప్రముఖుల‌‌‌‌‌‌‌‌తో ప్రక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్ని కూడా చేయించింది. 2022 నుంచి ఈ సంస్థలో ఒక్కొక్కరు రూ.20 లక్షల నుంచి 50 ల‌‌‌‌‌‌‌‌క్షలు పెట్టుబ‌‌‌‌‌‌‌‌డి పెట్టామ‌‌‌‌‌‌‌‌ని.. నాలుగేండ్లు గ‌‌‌‌‌‌‌‌డుస్తున్నా ఇప్పటికీ నిర్మాణం చేప‌‌‌‌‌‌‌‌ట్టలేదని బాధితులు రోడ్డెక్కారు. ఆర్‌‌‌‌‌‌‌‌జే గ్రూప్ ఎండీని గట్టిగా నిల‌‌‌‌‌‌‌‌దీస్తే చెక్కులు ఇచ్చారని.. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయ‌‌‌‌‌‌‌‌ని ఆవేద‌‌‌‌‌‌‌‌న వ్యక్తం చేశారు.

మూడేండ్లయినా బై బ్యాక్​ రాలే!

బై బ్యాక్ స్కీమ్ పేరుతో ప్లాట్లలో పెట్టుబడి పెడితే మూడేండ్ల త‌‌‌‌‌‌‌‌ర్వాత మ‌‌‌‌‌‌‌‌ళ్లీతామే కొంటామ‌‌‌‌‌‌‌‌ని సువ‌‌‌‌‌‌‌‌ర్ణ భూమి సంస్థ చెప్పింది. లే ఔట్లను అభివృద్ధి చేసే సంస్థలో సువ‌‌‌‌‌‌‌‌ర్ణభూమికి ప్రత్యేక పేరు ఉంది. ఈ సంస్థ పెద్ద పెద్ద సినీ స్టార్స్​తో  బ్రాండింగ్ చేయిస్తూ.. ప్లాట్ల కొనుగోలుదారుల‌‌‌‌‌‌‌‌కు ద‌‌‌‌‌‌‌‌గ్గరైంది. ‘త‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌కు చెర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ని చిరునామా’ అంటూ బ‌‌‌‌‌‌‌‌య్యర్లను విశేషంగా ఆక‌‌‌‌‌‌‌‌ర్షించింది.అయితే, ఈ కంపెనీ కూడా ఇప్పుడు మోస‌‌‌‌‌‌‌‌పూరిత సంస్థల జాబితాలో చేరింది. బై బ్యాక్ స్కీముతో త‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ను మోసం చేశారంటూ కొంద‌‌‌‌‌‌‌‌రు బ‌‌‌‌‌‌‌‌య్యర్లు పోలీస్​స్టేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌లో కేసు పెట్టారు. మూడేండ్ల కింద తాము పెట్టుబ‌‌‌‌‌‌‌‌డి పెట్టామ‌‌‌‌‌‌‌‌ని.. కానీ, ఇంత‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కూ  సొమ్ము ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేద‌‌‌‌‌‌‌‌న వ్యక్తం చేశారు. వ‌‌‌‌‌‌‌‌డ్డీ వ‌‌‌‌‌‌‌‌ద్దు, క‌‌‌‌‌‌‌‌నీసం అస‌‌‌‌‌‌‌‌లిచ్చినా చాల‌‌‌‌‌‌‌‌ని వేడుకుంటున్నారు. అయితే, తాము ఎలాంటి మోసం చేయ‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌ని.. బ‌‌‌‌‌‌‌‌య్యర్లకు ప్లాట్లను రాసిచ్చామ‌‌‌‌‌‌‌‌ని.. వాటిని అమ్ముదామంటే మార్కెట్ ప్రతికూలంగా ఉంద‌‌‌‌‌‌‌‌ని సంస్థ ఎండీ శ్రీధ‌‌‌‌‌‌‌‌ర్​ ఒక వీడియోలో చెప్పారు. పైగా.. స్థలాన్ని రిజిస్టర్ చేశామ‌‌‌‌‌‌‌‌ని, ఎంవోయూ కుదుర్చుకున్నామ‌‌‌‌‌‌‌‌ని సంస్థ ఎండీ శ్రీధ‌‌‌‌‌‌‌‌ర్  చెప్పడం.. రెరా నిబంధనలకు విరుద్ధమని, దీంతో ఆయనే త‌‌‌‌‌‌‌‌ప్పును ఒప్పుకున్నట్లయిందనిరెరా అధికారులు అంటున్నారు.

ఆ రెండు ఆఫర్లు రెరా రూల్స్​కు విరుద్ధం

ప్రీ లాంచ్,  బై బ్యాక్​ ఆఫర్లు.. ఈ రెండూ కూడా రెరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ, కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా.. మరికొందరు బహిరంగంగానే ప్రకటనలతో ముందుకొస్తున్నారు. ప్రీ లాంచింగ్​ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలుపెట్టకముందే.. ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. బై బ్యాక్​ ఆఫర్​ అంటే తమ ఫ్లాట్​/ప్లాట్​ పై ముందు పెట్టుబడి పెట్టండి.. ఆ తర్వాత  కొన్నేండ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువకు తామే కొంటామని చెప్పడం.