- హైదరాబాద్లో రూ.4,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తం
- బ్రిగేడ్ గ్రూప్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ హైదరాబాద్లో రూ.4,500 కోట్ల పెట్టుబడితో హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. బ్రిగేడ్ గేట్‌వే పేరుతో ఈ ప్రాజెక్టును కోకాపేటలోని నియోపోలిస్ వద్ద ప్రారంభించింది.
మొత్తం 45 లక్షల చదరపు అడుగుల్లో ప్రాజెక్టును డెలెలప్ చేస్తారు. 25 లక్షల చదరపు అడుగుల్లో లగ్జరీ ఇండ్లను నిర్మిస్తారు. ఈక్విటీ, కస్టమర్ల కంట్రిబ్యూషన్, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ ద్వారా నిధులు సమకూర్చుకుంటామని మైసూరుకు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది.
మొత్తం 600 ఫ్లాట్లను నిర్మిస్తామని, ధరలు రూ.నాలుగు కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయని తెలిపింది. కంపెనీ 20 లక్షల చదరపు అడుగుల్లో కమర్షియల్ టవర్‌ను, ఆఫీస్ స్పేస్‌ను, 300 గదుల ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌ను కూడా అందుబాటులోకి తెస్తుంది.