హైదరాబాద్, వెలుగు: విశాలమైన ఆఫీసులకు హైదరాబాద్లో భారీ డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. లక్ష చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో ఉన్న వాటిని లార్జ్ఫార్మాట్ఆఫీసులు అంటారు.
ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) 3.08 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీల జాగా అమ్ముడయింది. హైదరాబాద్లో జరిగిన మొత్తం లావాదేవీలలో 61శాతం వాటా ఈ సెగ్మెంట్నుంచే ఉంది. ఇది గత ఏడాది మొదటి ఆర్నెళ్లలో 1.47 మిలియన్ చదరపు అడుగులే ఉంది.