
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో గ్రేటర్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంటున్నదని కాన్ఫిడరేషన్ఆఫ్ రియల్ఎస్టేట్డెవలప్మెంట్అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్‌శాఖ తెలిపింది. ప్రస్తుతం రియల్ఎస్టేట్ డెవలప్మెంట్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత నాలుగో స్థానంలో హైదరాబాద్ఉందని, వచ్చే ఐదేండ్లలో దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్సిటీగా రూపుదిద్దుకునే అవకాశాలన్నాయని పేర్కొంది.
హైదరాబాద్నగరాన్ని జోన్ల వారీగా విశ్లేషిస్తూ రెసిడెన్షియల్, ఆఫీస్‌స్పేస్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో క్రెడాయ్, క్రి మ్యాట్రిక్స్ చేసిన సర్వే నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్‌శాఖ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్నాథ భండారి, క్రి మ్యాట్రిక్ సీఈవో అభిషేక్ కిరణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నివేదికలోని వివరాలను వెల్లడించారు.
అన్ని వైపులా అభివృద్ధి
ముంబై 50 ఏండ్లు, ఢిల్లీ 35 ఏండ్లు , బెంగళూరు 25 ఏండ్లలో రియల్‌ఎస్టేట్‌రంగంలో అభివృద్ధి సాధిస్తే హైదరాబాద్నగరం కేవలం 20ఏండ్లలోనే భారీగా పురోగతి సాధించిందని క్రెడాయ్, క్రి మ్యాట్రిక్స్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం సింగపూర్ వంటి దేశంలో అమ్మకాలకు సిద్ధంగా ఉన్న నిర్మాణాలతో పోలిస్తే హైదరాబాద్నగరంలో 83 మిలియన్చదరపు అడుగుల నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయని, ఇది అక్కడి కంటే డబుల్ అని వివరించింది. ‘‘కాంగ్రెస్ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ఎస్టేట్రంగానికి ఇస్తున్న అనేక ప్రోత్సాహకాల వల్ల ఈ రంగం పురోగమిస్తున్నది.
పశ్చిమాన మాత్రమే కాకుండా, తూర్పు వైపు కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రియల్‌రంగానికి ఊతమిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌ను సమానంగా సర్కార్డెవలప్ చేస్తున్నది. కొత్తగా ప్రతిపాదించిన సౌత్ఈస్ట్ జోన్‌లోని ఫ్యూచర్ సిటీ రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందుతుంది” అని క్రెడాయ్, క్రి మ్యాట్రిక్స్ రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం రియల్ఎస్టేట్ డెవలప్మెంట్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉందని, వచ్చే ఐదేండ్లలో దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్సిటీగా రూపుదిద్దుకునే అవకాశాలన్నాయని పేర్కొంది.
క్రెడాయ్, క్రి మ్యాట్రిక్స్ నివేదిక ప్రకారం రియల్ ఎస్టేట్ పెరుగుదల ఇట్లా..
హైదరాబాద్ నగరంలో 2023 సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2024 నాలుగో త్రైమాసికంలో రియల్ఎస్టేట్17 శాతం పురోగతి సాధించింది. హైదరాబాద్‌కు వాయువ్యంలో సగటు పెరుగుదల 20శాతంగా నమోదైంది. 2024 చివరి నాటికి నగరం గ్రేడ్–ఎ, గ్రేడ్–ఎ+లో ఉంది. అలాగే ఆఫీస్‌స్పేస్ అమ్మకాల్లో మరో 17 శాతం పెరుగుదల ఉంది. గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో 2024 నాలుగో త్రైమాసికంలో 58 శాతం పెరుగుదల కనిపించింది.
నార్త్‌వెస్ట్, నార్త్ఈస్ట్, సౌత్‌వెస్ట్, సౌత్ఈస్ట్లో రియల్ ఎస్టేట్పెరిగి నగర లావాదేవీల్లో 64శాతం షేర్ సాధించింది. ఇక్కడ లావాదేవీలు 19,826 కోట్లుగా నమోదైంది. హైదరాబాద్ సౌత్‌వెస్ట్‌లో రియల్ఎస్టేట్పెరుగుతూ 2024లో నాలుగో త్రైమాసికంలో అత్యధిక చదరపు అడుగుల విలువ రూ. 11,277గా రికార్డయింది. ఈ ప్రాంతాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ నిర్మాణాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. నగరంలోని అన్ని వైపులా రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్ అమ్మకాలు పుంజుకుంటున్నాయి.
పెద్ద మొత్తంలో పెట్టుబడులు
హైదరాబాద్ నగరంలో భవిష్యత్‌లో మరింత రియల్ఎస్టేట్ పెరుగుదలను ఊహించే పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. నగరంలో రియల్అమ్మకాలు 14 నుంచి 17శాతానికి పెరిగాయని, భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ప్రీమియం హౌసింగ్‌కు డిమాండ్ అధికంగా ఉందని చెప్పారు. నార్త్‌వెస్ట్, సౌత్‌వెస్ట్‌లో ఈ పెరుగుదల అధికంగా ఉందన్నారు. దీంతో నగరంలో రియల్‌రంగం స్థిరంగా, పారదర్శకంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. కమర్షియల్‌గా కూడా రియల్ఎస్టేట్పుంజుకుంటుందని, ఆఫీస్కార్యకలాపాల్లో 26 శాతం పెరుగుదల ఉందన్నారు.
ఈ పెరుగుదలతో భారీ మొత్తంలో పెట్టుబడులు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌గా అభివృద్ధి పెరుగుదల ఉంటుందని చెప్పారు. క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి జగన్నాథరావు భండారి మాట్లాడుతూ.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బలమైన పెట్టుబడులు, కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నదని తెలిపారు. 2024 నాలుగో త్రైమాసికంలో 16,644 యూనిట్ల అమ్మకాలు జరిగాయన్నారు. మరో 11,081 కొత్త యూనిట్లు లాంచ్ అయ్యాయని చెప్పారు. నగరంలో ఆఫీస్ స్పేస్‌కు అధిక డిమాండ్‌ఉందని, దీంతో నగరం పవర్ఫుల్ బిజినెస్ అండ్ఇన్వెస్ట్మెంట్ సెంటర్‌గా మారనుందని పేర్కొన్నారు.