తన సినిమా సైకలాజికల్ కల్కి అంటున్న ఉపేంద్ర..

తన సినిమా సైకలాజికల్ కల్కి అంటున్న ఉపేంద్ర..

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. అయితే ఉపేంద్ర ఎప్పుడూ రోటీన్ జోనర్ లో కాకుండా విభిన్న కథనాలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. దీంతో ఉపేంద్ర సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఉపేంద్ర "యూఐ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. 

ఇందులోభాగంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ  యూఐ సినిమా కచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఇప్పటివరకూ మీరు తెలుగులో మైథలాజికల్ కల్కి చూశారు.. కానీ తన సినిమా సైకలాజికల్ కల్కి అని చెప్పాడు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. 

Also Read : అక్కడ భారీగా పడిపోయిన పుష్ప 2 కలెక్షన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఇప్పటికే టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిందని ఈ క్రమంలో రూ.1000 కోట్లు, రూ.1500 కోట్లు కలెక్షన్స్ సాధిస్తున్నాయని త్వరలోనే రూ.2 వేల కోట్లు కలెక్షన్స్ సాధించే సినిమాలు కూడా టాలీవుడ్ నుంచి వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక యూఐ సినిమా డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోందని కావున ప్రతిఒక్కరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని ఫ్యాన్స్ ని కోరాడు. 

ఈ విషయం ఇలా ఉండగా ఉపేంద్ర యూఐ సినిమాలో హీరోగా దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమలో ఉపేంద్ర కి జంటగా రీష్మా  నటించగా స్పెషల్స్ సాంగ్స్ బ్యూటీ సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా  లహరి ఫిలిమ్స్, వేణు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ కన్నడ సినీ నిర్మాతలు జి. మనోహరన్, శ్రీకాంత్ కె.పి. తదితరులు కలసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ తదితర పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కానుంది.