100 సబ్ స్టేషన్లలో రియల్ టైమ్ డేటా పనులు

100 సబ్ స్టేషన్లలో రియల్ టైమ్ డేటా పనులు
  • మార్చి 1 నుంచి సేవలు అందుబాటులోకి..
  • ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి  వెల్లడి

హనుమకొండ సిటీ, వెలుగు :  ఎన్పీడీసీఎల్ పరిధిలో  సబ్ స్టేషన్ నుంచి ఎప్పటికప్పుడూ రియల్ టైమ్ డేటా పొందడానికి మార్చి 1 నుంచి 100 సబ్ స్టేషన్లలో పనులను ప్రారంభిస్తున్నట్టు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ లో  డైరెక్టర్లు, నోడల్ ఆఫీసర్లు,16 జిల్లాల డీఈ, ఏడీఈ, ఏఈ,ఎంఆర్ టీ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు డేటా కీలకమని, తొలిసారిగా 100 సబ్ స్టేషన్లలో పనులు చేపడతామని, అనంతరం దశలవారీగా ఇతర స్టేషన్లలో ప్రారంభిస్తామని తెలిపారు.

 వ్యాక్యుమ్ సర్క్యూట్ బ్రేకర్లతో ఫీడర్లు వేరు చేసి విద్యుత్ అంతరాయాన్ని తగ్గించవచ్చన్నారు. కెపాసిటర్ బ్యాంకులు పెట్టడంతో సబ్ స్టేషన్ లైన్లలో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ ని కూడా నియంత్రిస్తుందన్నారు. అవసరమైన చోట కొత్తగా పవర్ ట్రాన్స్ ఫార్మర్లు పెట్టాలని సూచించారు. ఇన్ చార్జి డైరెక్టర్లు, సీజీఎంలు , జీఎం, డీఈలు  పాల్గొన్నారు..