ఇండియాలో Realme 12 Pro 5G 12GB RAM, 256GB మోడల్ ప్రారంభించారు. మార్చి 15 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ విప్లవాత్మకమైన 12 GB RAM, 256 GB స్టోరేజ్ తో వస్తుంది. Realme 12 Pro 5G 8GB RAM , 128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 25,999 కాగా.. 8GB RAM, 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 26,999. 12GB RAM, 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 28,999. ఈ స్మార్ట్ ఫోన్ రూ.3వేల డిస్కౌంట్ తో లభిస్తుంది.
Realme 12 Pro 8GB RAM , 128 GB.. 8GB RAM , 256GB కాన్ఫిగరేషన్లను జనవరిలోనే ప్రారంభించింది. కొత్త RAM , స్టోరేజ్ పాటు, మిగిలిన స్ఫెసిఫికేషన్లతో Realme 12 Pro 5G వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Snopdragon 6 Gen 1 SoC సిస్టమ్ తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల AMOLED డిస్ ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 14 OS తో పనిచేస్తుంది.
Realme 12 Pro 5G స్పెసిఫికేషన్స్
- Realme 12 Pro 5G 6.7 అంగుళాల ఫుల్ HD+AMOLED డిస్ ప్లే
- 120 Hz రిఫ్రెష్ రేట్, 950 nits బ్రైట్ నెస్,
- 240 టచ్ శాంప్లింగ్ రేట్,
- 100 శాతం P3 కలర్ గామట్,
- 2160 hz PWM డిమ్మింగ్, 950 వరకు బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది
- Adreno 710 GPU తో Qualcomm Snapdragon 6 Gen 1 SoC సిస్టమ్ ను కలిగి ఉంటుంది.
- చిప్ సెట్ 8GB/12GB RAM, 128GB/256GB 3.1 స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది.
- ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ తో రన్ అవుతుంది.
- కనెక్టివిటీ ఎంపికల్లో 5G, WiFi6 802.11, బ్లూటూత్ 5.2, GPS, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, USB 2.0 ఉన్నాయి.
- డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP65 రేటింగ్, స్టీరియో స్పీకర్లు, డాల్ఫీ అట్మోస్, హైరెస్ ఆడియో ఉన్నాయి.
- Realme 12 Pro లో OIS తో 50 MP Sony IMX882 సెన్సార్,
- 2x ఆప్టికల్ జూమ్ తో 32 MP సోని IMX 709 టెలిఫొటో సెన్సార్,
- 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
- సెల్పీ, వీడియో చాట్ లకోసం 16 MP ఫ్రంట్ షూటర్ కెమెరా
- 67 W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 500 mAh బ్యాటరీతో వస్తుంది