
స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ మనదేశ మార్కెట్లోకి 12, 12 ప్లస్ సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ 12 5జీ ఫోన్లో 6.72 ఇంచుల స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్, 108 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. రియల్మీ 12 ప్లస్‌లో 6.7 ఇంచుల స్క్రీన్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంటాయి. ధరలు రూ.16 వేల నుంచి మొదలవుతాయి.