
స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ 13 ప్లస్, 13 ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొదటి మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, 26జీబీ వరకు డైనమిక్ ర్యామ్, 80 వాట్ల చార్జింగ్, 50 ఎంపీ సోనీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.
8జీబీ +128జీబీ ధర రూ. 22,999, 8జీబీ+256జీబీ ధర రూ. 24,999 కాగా, 12జీబీ +256జీబీ ధర రూ.27 వేలు. రియల్మీ 13 5జీ 8జీబీ+128జీబీ ధర రూ. 17,999 కాగా, 8జీబీ+256జీబీ ధర రూ. 19,999. రియల్మీ స్టోర్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఫోన్లను బుక్చేయవచ్చు.