చైనాకు చెందిన రియల్ మీ కంపెనీ సీ సిరీస్ నుంచి సీ 30 ఎస్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో సెప్టెంబర్ 14 విడుదల చేసింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... వినియోగదారుల వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుతుందని పేర్కొంది. Realme C30s 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. 6.5 అంగుళాలతో అన్ లాక్ ఫీచర్ తో ఈ ఫోన్ ను తీసుకొచ్చింది. కేవలం 0.58 సెకన్లలో అన్ లాక్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. యూనిసాక్ ఎస్ సీ 9863ఏ అక్టాకోర్ ప్రాసెసర్ తో పని చేయనుంది.
సెల్ ఫోన్ వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ ఏఐ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. సెల్ ఫోన్ లను వినియోగదారులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ వెల్లడించారు. సాంకేతికత, డిజైన్ లతో రూపొందించామన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ప్లిఫ్ కార్ట్ లో సెప్టెంబర్ 23 అర్ధరాత్రి రియల్ మీ వెబ్ సైట్ లో విక్రయాలు జరుగనున్నాయి.
- Realme C30s స్ట్రెప్ బ్లాక్, స్ట్రైప్ బ్లూ రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
- రెండు వేరియంట్ లో ఉన్నాయి.
- 2GB RAM + 32GB తో ఉన్న ఈ ఫోన్ ధర రూ.7,499.
- 4GB RAM + 64GB తో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 8,999.
Powerful specs secured by a Fast Side-Fingerprint sensor, with an Anti-Slip Design. Introducing the all-new #realmeC30s.
— realme (@realmeIndia) September 14, 2022
Starting from ₹ 7,499*
First Sale on 23rd Sept, 00:00 Hrs.
Available for @Flipkart Plus customers on 22nd Sept, 00:00 Hrs
*T&C Apply