Realme Ear Buds:40 గంటల ఛార్జింగ్తో ఇయర్ బడ్స్..ధర,లాంచ్ ఆఫర్లు

Realme Ear Buds:40 గంటల ఛార్జింగ్తో ఇయర్ బడ్స్..ధర,లాంచ్ ఆఫర్లు

సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ తయారీ సంస్థ Realme..కొత్త ఇయర్ బడ్స్..రియల్ మీ బడ్స్ ఎయిర్6 ప్రోను విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ హైక్వాలిటీ డ్యు యల్ డ్రైవర్స్ తో అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. జూన్ 27 న ప్రారంభించిన ఈ కొత్త ఇయర్ బడ్ లు, ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. Realme.com, Flipkart లో మొదటి సేల్ ప్రారంభించబడింది. ఈ సేల్ లో కొనుగోలు దారులకు లాంచ్ ఆఫర్లను అందిస్తున్నారు. 

రియల్‌మి బడ్స్ ఎయిర్6 ప్రో హైఫై క్వాలిటీ డ్యూయల్ డ్రైవర్‌లను కలిగి ఉంది. ఈ కో ఆక్సిల్ డ్యూయల్ డ్రైవర్లు (11 మిమీ + 6 మిమీ)మంచి సౌండ్ ను అందిస్తాయి. అదనంగా 50 DB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ని అందిస్తుంది. యాంబియంట్ నాయిస్ ను తగ్గించి మంచి మ్యూజిక్ ను వినిపిస్తుంది. 360 స్పేషియల్ ఎఫెక్ట్, డైనమిక్ బాస్ బూస్ట్ తో సౌండ్ క్వాలిటీ పెంచుతుంది. మ్యూజిక్, సినిమాలు, గేమ్ లను మరింత ఎంజాయ్ చేయొచ్చు. 

ఇంకా Realme Buds Air 6అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునే బ్యాటరీ ఒకటి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 40 గంటల పాటు ప్లే బ్యాక్ ను ఎంజాయ్ చేయొచ్చు. దీంతో తరుచుగా రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇయర్ బడ్ లను ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఇక గేమర్లకోసం 55ms లో లేటెన్సీ మోడ్, ఆడియోను స్క్రీన్ పై యాక్టివిటీని ఏకం చేసి మంచి అనుభూతిని కలిగిస్తుంది. 

ఈ ఇయర్ బడ్ లు 6మైక్ లతో కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ను కలిగి ఉంటాయి.. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో నైనా స్పష్టమైన, ఎలాంటి ఆటంకం లేని కాల్ క్వాలిటీని అందిస్తుంది. 

Realme Buds Air6 ప్రో మొదటి సేల్ జూన్ 27న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు realme.com , Flipkart నుంచి ఇయర్‌ బడ్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ Realme Buds Air6 ప్రో అధిక-నాణ్యత ఆడియో, లేటెస్ట్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్లను అందిస్తుంది. ప్రారంభ సేల్ లో Realme Buds Air6 ప్రో ఇయర్ బడ్ లు మంచి ఆఫర్లను అందిస్తోంది.