Realme..కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తోంది. GT లైనప్ లో రెండు సంవత్సరాల తర్వాత భారతదేశంలో Realme GT 6T స్మార్ట్ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఈ విష యాన్ని X లో అధికారికంగా ప్రకటించింది. Realme GT 6T కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC ద్వారా పనిచేస్తుంది. Realme GT 6T అనేది Realme GT Neo 6 SE రీబ్రాండ్ గా మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త హ్యాండ్ సెట్ 8GB RAM + 256GB స్టోరేజ్ తో లభించనుంది. దీని ధర రూ. 18,000 ఉంటుందని అంచనా.
Realme GT Neo 6 SE Snapdragon 7+ Gen 3 SoC తో , 120Hz రిఫ్రెష్ రేట్, 6,00 nits బ్రైట్ నెస్ తో 6.78-అంగుళాల 8T LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ , 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది 16GB RAM,512GB వరకు నిల్వను అందించే వేరియంట్ లో కూడా లభించనుంది. ఈ డివైజ్ 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 5,500mAh పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ ఫ్రూప్ బాడీ ఉంటుంది.
- Qualcomm Snapdragon 7+ Gen 3 SoCని కలిగి ఉన్న భారతదేశపు మొదటి ఫోన్ Realme GT 6T.
- AnTuTu బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారంలో Realme GT 6T 1.5 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ చేయగలదని బ్రాండ్ పేర్కొంది.
- ఈ హ్యాండ్ సెట్ చిప్‌సెట్ అధునాతన 4nm TSMC ప్రాసెసర్‌పై నిర్మించబడింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్, స్పీడ్ తో వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది.
- Snapdragon 7+ Gen 2తో పోల్చినప్పుడు, Realme GT 6Tలోని SD 7+ Gen 3 CPU పనితీరులో 15 శాతం పెరుగుదల GPU పవర్‌లో 45 శాతం బూస్ట్‌ను అందిస్తుంది.
- ఖచ్చితమై డేట్ ప్రకటించకపోయినా ఈనెలలో (మే)నే కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.