4 నిమిషాల్లో రియల్‌‌మీ ఫోన్​చార్జ్​

4 నిమిషాల్లో రియల్‌‌మీ ఫోన్​చార్జ్​

హైదరాబాద్, వెలుగు: రియల్‌‌మీ తన స్మార్ట్‌‌ఫోన్‌‌లలో చార్జింగ్​ కోసం సోనిక్ చార్జ్ టెక్నాలజీని డెవెలప్​ చేసింది. ఇది కేవలం నాలుగు నిమిషాల్లో   ఫోన్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సహాయపడుతుంది. సోనిక్​చార్జ్​కు​320 వాట్ల సామర్థ్యం ఉంటుంది.  బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడేలా దీనిని రూపొందించామని, తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని బ్యాటరీకి అందిస్తుందని రియల్​మీ తెలిపింది. 

ఇది ఫోన్ ఉపయోగ విధానాన్ని బట్టి చార్జింగ్ స్పీడ్‌‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది.   కేవలం ఒక్క నిమిషంలో 320వాట్ల చార్జర్ 26శాతం బ్యాటరీని చార్జ్ చేస్తుంది. ఫోన్ ని 50శాతం చార్జ్ చేస్తే రెండు కన్నా తక్కువ నిమిషాలు పడుతుంది.  ఈ నెల 14న చార్జర్​ను ప్రదర్శిస్తామని రియల్​మీ తెలిపింది.