కొంతమందికి పొరిగింటిపుల్ల కూరంటే మక్కువెక్కువే. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీల బ్రాండ్ అంబాసీడర్లు ఐఫోన్ ను వినియోగిస్తుంటారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. శాంసంగ్ రష్యా మాజీ బ్రాండ్ అంబాసీడర్ సాబ్ చెక్, మారూన్ 5 ఆడమ్ లేవిని, టెన్నీస్ ఐకాన్ ఫెరీర్ లు ఐఫోన్ ను వినియోగిస్తున్నారు. అదే పలు స్మార్ట్ ఫోన్ కంపెనీల సీఈవో లు ఐఫోన్ ను వినియోగించడం టెక్ ప్రపంచంలో విచిత్రమనే చెప్పుకోవాలి.
స్మార్ట్ ఫోన్ సంస్థలో సీఈవోలుగా చెలామణి అవుతూ ఐఫోన్ తమ స్టేటస్ సింబాలిక్ గా రుజువు చేస్తున్నారు.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రీల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ కూడా ఐఫోన్ వాడుతున్నట్లు తేలింది. అదెలా అంటారా. రీల్ మీకి చెందిన అప్ డేట్ లను ట్వీట్ చేస్తుంటారు. నవంబర్ 16న రీల్ మీ3 గురించి ట్వీట్టర్ లో అప్ డేట్ చేశారు. ఆ ట్వీట్ ను అబ్జర్వ్ చేస్తే ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అని స్పష్టంగా ఉందని గిజ్ చైనా అనే మీడియా సంస్థ ట్వీట్ చేసింది.
అయితే ఆ ట్వీట్ రీల్ మీ ఇండియా సీఈవో మాధవ్ చేశారని ఎలా చెప్పగలరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయా దిగ్గజ కంపెనీలకు పబ్లిసిటీ టీం ఉంటుందని, ఆ టీంలోని సభ్యులెవరైనా ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు.