Realme 14 Pro Plus:యునీక్ పెరల్ డిజైన్​..రంగులు మార్చే స్మార్ట్​ ఫోన్​ 

5జీ స్మార్ట్ ఫోన్​లైన రియల్​ మీ14 ప్రొ, రియల్​ మీ 14 ప్రొ ప్లస్ అనే సరికొత్త సిరీస్​లు మార్కెట్లోకి అతి త్వరలో రాబోతున్నాయి. ఈ ఫోన్​లలో స్పెషాలిటీ ఏంటంటే.. మొదటిది యునీక్ పెరల్ డిజైన్​ ఉంటుంది. దీనిలో పెర్ల్​ వైట్ వేరియంట్‌ స్పెషల్​ షేప్​లో ఉంటుంది. ఆ షేప్ సీషెల్ పౌడర్ నుంచి తీసుకున్నారట. ఈ ఫోన్ చూడడానికి చాలా సన్నగా ఉంటుంది. ప్రతి ఫోన్​ వెనక ప్యానెల్​పై డిఫరెంట్​ మోడల్ ఉంటుంది. ఇది నేచురల్ సీ షెల్స్​లాగే కనిపిస్తుంది. దీన్ని 30 డిగ్రీల ఫ్యూజన్ ఫైబర్ ప్రక్రియ ద్వారా డిజైన్ చేశారు. ఇందులో 95 శాతం పర్యావరణ అనుకూలమైన, బయో బేస్డ్​ మెటీరియల్స్​ను ఉపయోగించారు. ఈ డిజైన్ వర్క్స్‌ కారణంగా స్మార్ట్​ ఫోన్​ లుక్ కంప్లీట్​ డిఫరెంట్​గా మారుతుంది. ఇది కస్టమర్​కు ప్రీమియం ఎక్స్​పీరియెన్స్ ఇస్తుందట! 

ఇక రియల్​ మీ 14 ప్రొ ప్లస్ విషయానికొస్తే.. సెగ్మెంట్​ – ఫస్ట్ క్వాడ్​– కర్వ్​ డిస్​ప్లే, స్క్రీన్​ టు బాడీ రేషియో 93.8 శాతం కలిగి ఉంటుంది. ఈ డిస్​ప్లే యూజర్లకు ఎడ్జ్​ స్వైపింగ్ కంఫర్ట్ ఇస్తుంది. అలాగే దీనికి ఓషన్ ఒకులస్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్​ ఉంటుంది. ఇందులో కొత్త మ్యాజిక్​ గ్లో ట్రిపుల్ ఫ్లాష్​ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఫ్లాష్​ తక్కువ వెలుతురులో కూడా ఎక్కువ కాంతితో మంచి ఫొటోలు తీస్తుంది. ఇది నీళ్లలో తడిసినా, దుమ్ములో పడినా ఫోన్​కి ఏం కాదు. ఎందుకంటే ఇది వాటర్, డస్ట్ ప్రూఫ్​. 

దాంతోపాటు ఈ ఫోన్​ల​లో ఇంట్రెస్టింగ్​ ఏంటంటే... వీటి వెనుక ఉన్న బ్యాక్ డిజైన్​ మోడర్న్​ థర్మోక్రోమిక్ పిగ్మెంట్​లతో డిజైన్ చేసి ఉంటుంది. ఇవి టెంపరేచర్​లో మార్పులను బట్టి వాటి రంగును మారుస్తాయి. టెంపరేచర్​16 డిగ్రీల కంటే తక్కువ ఉంటే, వెనక కవర్​ పెర్ల్​ వైట్ నుంచి వైబ్రంట్ బ్లూకి మారుతుంది. టెంపరేచర్​ పెరిగేకొద్దీ అది తిరిగి అదే రంగులోకి వచ్చేస్తుంది. భలే ఉందే..! కొనేద్దాం అనుకుంటున్నారా.. ఒక్క క్షణం ఆగండి. ఈ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవు. జనవరి16న ఇండియాలో లాంచ్​ చేయబోతున్నారు. రియల్​ మీ వెబ్​ సైట్​, ఫ్లిప్​ కార్ట్​ యాప్​లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ అనౌన్స్ చేసింది.