రియల్‌‌మీ నాజో 60 సిరీస్‌‌లో కొత్త ఫోన్లు

ఒక టీబీ స్టోరేజి కెపాసిటీతో నాజో 60 సిరీస్‌‌ 5జీ స్మార్ట్‌‌ఫోన్లను  రియల్‌‌మీ లాంచ్ చేసింది. రియల్‌‌మీ నాజో 60 ప్రో 5జీ  ధర రూ.23,999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ  స్మార్ట్‌‌ఫోన్‌‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్‌‌ సూపర్‌‌‌‌వోక్‌‌ ఛార్జింగ్ సపోర్ట్‌‌, 1 టీబీ స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.   నాజో 60 5జీ స్టార్టింగ్ ప్రైస్‌‌ రూ.17,999.   ఇందులో అమోలెడ్‌‌ డిస్‌‌ప్లే, 64 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎల్‌‌జీ ఇయర్ బడ్స్ లాంచ్‌‌

ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్ తాజాగా ఇయర్‌‌‌‌బడ్స్‌‌ను లాంచ్ చేసింది. ఎల్‌‌జీ ఎక్స్‌‌బూమ్‌‌ సిరీస్‌‌ను, ఎల్‌‌జీ టోన్ ఫిట్‌‌ టీఎఫ్‌‌7 ను తీసుకొచ్చింది. ఎల్‌‌జీ ఎక్స్‌‌బూమ్‌‌ సిరీస్‌‌లోని ఆర్‌‌‌‌ఎన్‌‌సీ 9, ఆర్‌‌‌‌ఎన్‌‌సీ7, ఆర్‌‌‌‌ఎన్‌‌సీ 5 మోడల్స్ రేట్లు రూ.22 వేల నుంచి మొదలవుతున్నాయి. ఎల్‌‌జీ టోన్‌‌ఫిట్‌‌ టీఎఫ్‌‌7 ధర రూ. 12,500. ఈ ప్రొడక్ట్‌‌లు ఆగస్టు నుంచి మార్కెట్‌‌లోకి రానున్నాయి.

లోధా రూ.122 కోట్ల ఫ్లాట్‌‌

రియల్‌‌ ఎస్టేట్ కంపెనీ లోధా  ముంబైలోని అత్యంత ఖరీదైన  అపార్ట్‌‌మెంట్‌‌ను బర్వాలే  సీడ్స్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌ డైరెక్టర్ రాజేంద్ర బర్వాలేకి అమ్మింది. ఈ ఫ్లాట్ ధర రూ.122 కోట్లు. అత్యంత ఖరీదైన ఏరియా అయిన ముంబై మలబార్ హిల్‌‌లో ఈ ఫ్లాట్ ఉంది. మలబార్ ప్యాలెసెస్‌‌ ప్రాజెక్ట్‌‌ను లోధా డెవలప్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్లాట్ కార్పెట్ ఏరియా 9,546 చదరపు అడుగులు. బాల్కనీ,  వరండా, టెర్రస్‌‌ వంటివి కూడా ఉన్నాయి.

ALSO READ:24 గంటల ఉచిత కరెంట్​లో నిజాలేంటి?

అఫోర్డబుల్ ధరలో  ఇన్ఫినిక్స్‌‌ హాట్‌‌30 5జీ

హాట్‌‌ 30 5జీ మోడల్‌‌ను ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌‌ ధర రూ. 11,499 నుంచి ప్రారంభమవుతోంది.  6.78 ఇంచుల ఎఫ్‌‌హెచ్‌‌డీ డిస్‌‌ప్లే, 120 హెజ్ రిఫ్రెష్ రేట్‌‌, మీడియా టెక్‌‌ డైమెన్సిటీ 6020 5జీ ఆక్టా కోర్ ప్రాసెసర్‌‌‌‌, 50 ఎంపీ డ్యూయల్ ఏఐ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్‌‌లో ఉన్నాయి. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం దీని సొంతం.