రియల్‌‌‌‌‌‌‌‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు

రియల్‌‌‌‌‌‌‌‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు

రియల్‌‌‌‌‌‌‌‌మీ ఇండియా మార్కెట్లో నార్జో 80ప్రో, రియల్‌‌‌‌‌‌‌‌మీ నార్జో 80ఎక్స్​ అనే రెండు కొత్త స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లను విడుదల చేసింది.  నార్జో 80ప్రో ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీడియాటెక్  డైమెన్సిటీ 7400 చిప్‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌, 6,000 ఎంఏహెచ్​బ్యాటరీ, 7.55ఎంఎం మందం బాడీ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 

 నార్జో 80ఎక్స్ ధర రూ. 11,999 నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్లో  మీడియాటెక్  డైమెన్సిటీ 6400 చిప్​సెట్​,  45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌, 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, ఐ కంఫర్ట్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే ఉంటాయి. రెండు ఫోన్లనూ అమెజాన్,  రియల్‌‌‌‌‌‌‌‌మీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్​లో అందుబాటులో ఉంటాయి.