రియల్ మీNeo 7x స్మార్ట్ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

రియల్ మీNeo 7x స్మార్ట్ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Realme Neo 7x స్మార్ట్ఫోన్ లాంచ్ అయింది.ఈ హ్యాండ్ సెట్Qualcommకు చెందిన కొత్త  4nmఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6Gen4 చిప్ సెట్, 12GB  RAM తో వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఛార్జీంగ్ కోసం.. 45వాల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ హ్యాండ్ సెట్ లో 50మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా,16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. భద్రతకోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంది. వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కోసం IP69 రేటింగ్ లను ఉంది. 

Realme Neo 7x ధర, లభ్యత

చైనాలో Realme Neo 7x ధర 8GB + 256GB ఎంపిక కోసం CNY 1,299 (సుమారు రూ. 15,600) నుంచి ప్రారంభమవుతుంది, అయితే 12GB + 512GB వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ. 19,200). ఇది ప్రస్తుతం దేశంలో Realme చైనా ఈ--స్టోర్,ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Also Read : గేమింగ్​ లవర్స్​ కోసం ఐకూ10ఆర్​

Realme Neo 7x ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

  • ఇటీవల అందుబాటులోకి వచ్చిన స్నాప్‌డ్రాన్ 6 జెన్ 4 SoC టెక్నాలజీని వినియోగిస్తున్న ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ ఫోన్ రియల్ మీ నియో7x.
  • 6000mAh బ్యాటరీతో అద్బుతమైన బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. 
  • Realme Neo 7x స్మార్ట్ ఫోన్  7.97mm అల్ట్రా-స్లిమ్ బాడీతో చాలా తేలికగా ఉంటుంది. 
  • ఈ హ్యాండ్ సెట్ మరో స్పెషల్ ఫీచర్.. Realme GT 7 Pro రేసింగ్ ఎడిషన్‌లో కనిపించే “ బైపాస్ ఛార్జింగ్ ” టెక్నాలజీ. ఇది బ్యాటరీని ఛార్జ్ చేయడానికి బదులుగా నేరుగా గేమ్‌కు శక్తిని అందించడం ద్వారా ఛార్జింగ్, గేమింగ్ చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు సాయ పడుతుంది. 
  • డిస్ ప్లే: 6.67-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే
  • కెమెరా : ఇది 50MP ప్రైమరీ,16MP ఫ్రంట్ కెమెరా
  • స్టోరేజీ: 6GB, 8GB, 12GB ,16GB RAM ఎంపికలలో 128GB, 256GB, 512GB, 1TB వరకు స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. 
  • ఛార్జింగ్ : ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జీంగ్ కు సపోర్టు. 

Realme Neo 7x  స్మార్ట్ ఫోన్ ను మనదేశంతో సహా ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో Realme 14 5G , Realme P3 5G వంటి విభిన్న పేర్లతో లాంచ్ కావచ్చని ఊహాగా నాలు ఉన్నాయి.