ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రియల్ మీ P3 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఫిబ్రవరి 18 న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. Realme P3 Pro, P3 5G, P3x 5G, P3 Ultra ఫోన్లను ప్రారంభించనుంది. ఇందులో Realme P3 Pro స్మార్ట్ డ్యూయల్ కెమెరా సెటప్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. Realme P3 Pro విడుదల తేదీ, ధర స్పెసిఫికేషన్‌ల గురించి స్పెక్యులేషన్స్ ఇలా ఉన్నాయి.
Realme P3 Pro స్మార్ట్ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6,000 mAh బ్యాటరీని ప్యాక్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మిగతా ఫీచర్లు, స్పెసిఫి కేషన్లు వెల్లడించడలేదు. ఇంటర్నెట్ లో స్పెసిఫికేషన్లపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ALSO READ | గుడ్న్యూస్..బెస్ట్ BSNL లాంగ్టర్మ్ రీచార్జ్ ప్లాన్.. బీటీవీ ద్వారా 450ఛానెల్స్ ఫ్రీ
realme P3 Pro స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుందని 91Mobiles అంచనావేస్తోంది. ఇది Nebula Glow, Galaxy Purple , Saturn Brown కలర్లలో లభించనుంది. స్టోరేజ్ విషయానికి వస్తే..12GB వరకు RAM ,256GB వరకు స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్ డివైజ్ లో కెమెరా విషయంలో బెస్ట్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా..50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన మల్టీ-కెమెరా సెటప్‌ను ఉంటుందని భావిస్తు న్నారు.
ధర విషయంలో P2 ఫోన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రియల్‌మీ P2 ప్రో ప్రారంభ ధర రూ.21,999 ఉండగా..Realme P3 Pro ధర రూ.25లలోపు ఉండవచ్చని భావిస్తున్నారు.
ఫిబ్రవరి 18న P3 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతాయని కంపెనీ చెబుతోంది. ప్రారంభ సేల్ గా Realme P3 Pro ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.